వైదిక జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని ఆత్మకారకుడిగా, ధైర్యానికి, అధికారానికి, గౌరవానికి, తండ్రికి ప్రతీకగా భావిస్తారు. సూర్యుడు రాశి మారినా, నక్షత్రం మారినా ఆ ప్రభావం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గ్రహాల రాజు సూర్యుడు త్వరలోనే రాహువు అధిపత్యం వహించే ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఈ ఏడాది జూన్ 22న సూర్యుడు మృగశిర నక్షత్రాన్ని వీడి ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూలై 5 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు నక్షత్రంలోకి సూర్యుడి రాక అత్యంత కీలకమైన ఖగోళ పరిణామం. ఛాయా గ్రహమైన రాహువు మానవ జీవితంలో ఆకస్మిక మార్పులను తీసుకువస్తాడు. అటువంటి రాహువు నక్షత్రంలోకి సూర్యుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి అయాచిత ధనలాభం, అదృష్టం కలిసి రానున్నాయి. ఆ లక్కీ రాశుల వివరాలు ఇవే.
1.సింహ రాశి
సూర్యుడి నక్షత్ర సంచారం సింహ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం ఎంతో అనుకూలిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు బలంగా ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీలో ధైర్యసాహసాలు పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరిగి, గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలను ఆర్జిస్తారు.
2.కన్యా రాశి
ఈ సమయంలో కన్యా రాశి వారికి ఊహించని విధంగా భారీగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. కెరీర్‌లో అద్భుతమైన పురోగతి చూస్తారు. వ్యాపారంలో మంచి స్థిరత్వం లభిస్తుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కుతాయి, వాటిని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం."రాహువు నక్షత్రంలో సూర్యుడి సంచారం వల్ల ఈ రాశుల వారికి ఆకస్మిక రాజయోగాలు పడతాయి," అని జ్యోతిష్య నిపుణులు వివరించారు. అదృష్టం తోడుండటంతో చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి.
3.వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబంలో సాగుతున్న గొడవలు, సమస్యలు ముగుస్తాయి. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. కెరీర్‌లో ముందుకు సాగడానికి సరికొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, అవి భవిష్యత్తులో లాభదాయకంగా మారుతాయి.
4.కుంభ రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ సమయం పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా రోజులుగా వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబంలో సాగుతున్న గొడవలు, సమస్యలు ముగుస్తాయి. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. కెరీర్‌లో ముందుకు సాగడానికి సరికొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, అవి భవిష్యత్తులో లాభదాయకంగా మారుతాయి.
4.కుంభ రాశి
{{/usCountry}}సూర్యుడి నక్షత్ర మార్పు కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి ఆఫర్లు వస్తాయి. గతంలో మీరు పడ్డ శ్రమకు ఇప్పుడు పూర్తి ఫలితం దక్కుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాల ఆధారంగా ఇచ్చినది మాత్రమే. దీనిని ధృవీకరించే శాస్త్రీయ ఆధారాలు లేవు. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.