గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 14న సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి నెలా సూర్యుడు కొత్త సంచారంలో మార్పు చేస్తూ ఉంటాడు. మార్చి 14న సూర్య సంచారం జరగడంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్య సంచారం ప్రభావం చూపిస్తుంది. మరి ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకుందాం.
మీన రాశిలోకి సూర్యుడు.. 12 రాశుల వారిపై ప్రభావం
మేష రాశి:

మేష రాశి వారికి సూర్య సంచారం వలన పాత సమస్యల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ఈ రాశి వారికి 11వ ఇంట్లో సూర్య సంచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. విలాసాలను పొందుతారు.
మిథున రాశి:
ఈ రాశి వారికి మూడవ ఇంట్లో సూర్య సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సమయం. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. అలాగే మీ సీనియర్లు మీ పనిని చూసి నేర్చుకుంటారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య సంచారం వలన విదేశీ కలలు నెరవేరుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి 8వ ఇంట్లో సూర్య సంచారం జరగబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మాటలో మాధుర్యం పెరుగుతుంది.
కన్య రాశి:
ఈ రాశి వారికి ఏడవ ఇంట్లో సూర్య సంచారం జరగనుంది. ఈ రాశి వారికి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవచ్చు. అలాగే ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది.
తులా రాశి:
{{/usCountry}}ఈ రాశి వారికి ఏడవ ఇంట్లో సూర్య సంచారం జరగనుంది. ఈ రాశి వారికి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవచ్చు. అలాగే ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది.
తులా రాశి:
{{/usCountry}}ఈ రాశి వారికి 6వ ఇంట్లో సూర్య సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఐదవ ఇంట్లో సూర్య సంచారం జరగనుంది. ఈ సమయంలో ఈ రాశి వారు క్రియేటివ్ పనులను పూర్తి చేస్తారు. ఆర్ట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి నాల్గవ ఇంట్లో సూర్య సంచారం జరగబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు పనిలో కొత్త బాధ్యతలను చేపడతారు. లైఫ్ ఆనందంగా సాగుతుంది.
మకర రాశి:
మకర రాశి వారు ఈ సమయంలో కొత్త పనులను మొదలుపెడతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇదివరకు కంటే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తి చేస్తారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. స్నేహితులకు సహాయం చేస్తారు. కొత్త పనిని కూడా ప్రారంభిస్తారు.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ సమయంలో చిన్న చిన్న కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసికంగా కూడా ఇబ్బందులు రావచ్చు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్లాన్లు వేస్తారు.