మీన రాశిలోకి సూర్యుడు, 12 రాశుల వారిపై ప్రభావం.. వీళ్ళకు బోలెడు లాభాలు!

మార్చి 14న సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి నెలా సూర్యుడు కొత్త సంచారంలో మార్పు చేస్తూ ఉంటాడు. మార్చి 14న సూర్య సంచారం జరగడంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్య సంచారం ప్రభావం చూపిస్తుంది. మరి ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకుందాం

Published on: Mar 12, 2026 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 14న సూర్యుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రతి నెలా సూర్యుడు కొత్త సంచారంలో మార్పు చేస్తూ ఉంటాడు. మార్చి 14న సూర్య సంచారం జరగడంతో కొన్ని రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారిపై సూర్య సంచారం ప్రభావం చూపిస్తుంది. మరి ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడిందో తెలుసుకుందాం.

మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో 12 రాశుల వారిపై ప్రభావం (pinterest)
మీన రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో 12 రాశుల వారిపై ప్రభావం (pinterest)

మీన రాశిలోకి సూర్యుడు.. 12 రాశుల వారిపై ప్రభావం

మేష రాశి:

మేష రాశి వారికి సూర్య సంచారం వలన పాత సమస్యల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి:

ఈ రాశి వారికి 11వ ఇంట్లో సూర్య సంచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. విలాసాలను పొందుతారు.

మిథున రాశి:

ఈ రాశి వారికి మూడవ ఇంట్లో సూర్య సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సమయం. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. అలాగే మీ సీనియర్లు మీ పనిని చూసి నేర్చుకుంటారు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి సూర్య సంచారం వలన విదేశీ కలలు నెరవేరుతాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

సింహ రాశి:

సింహ రాశి వారికి 8వ ఇంట్లో సూర్య సంచారం జరగబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మాటలో మాధుర్యం పెరుగుతుంది.

కన్య రాశి:

ఈ రాశి వారికి ఏడవ ఇంట్లో సూర్య సంచారం జరగనుంది. ఈ రాశి వారికి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవచ్చు. అలాగే ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది.

తులా రాశి:

ఈ రాశి వారికి 6వ ఇంట్లో సూర్య సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది శుభ సమయం.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఐదవ ఇంట్లో సూర్య సంచారం జరగనుంది. ఈ సమయంలో ఈ రాశి వారు క్రియేటివ్ పనులను పూర్తి చేస్తారు. ఆర్ట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.

ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి నాల్గవ ఇంట్లో సూర్య సంచారం జరగబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు పనిలో కొత్త బాధ్యతలను చేపడతారు. లైఫ్ ఆనందంగా సాగుతుంది.

మకర రాశి:

మకర రాశి వారు ఈ సమయంలో కొత్త పనులను మొదలుపెడతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇదివరకు కంటే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. పెండింగ్‌లో ఉన్న టాస్కులను పూర్తి చేస్తారు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఆర్థికపరంగా బాగుంటుంది. స్నేహితులకు సహాయం చేస్తారు. కొత్త పనిని కూడా ప్రారంభిస్తారు.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ సమయంలో చిన్న చిన్న కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మానసికంగా కూడా ఇబ్బందులు రావచ్చు. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్లాన్లు వేస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More