...
...
Next Story

Sun Transit: అలర్ట్! సూర్యుడు తన శత్రు రాశిలోకి.. ఈ రాశుల వారికి అగ్నిపరీక్షే, మీ రాశి ఉందో చూసుకోండి!

Sun Transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజుగా పిలువబడే సూర్యుడు మే 15న తన శత్రు రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల ఏర్పడే 'వృషభ సంక్రాంతి' ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది. ముఖ్యంగా కెరీర్, ఆరోగ్యం విషయంలో ఈ నాలుగు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

Published on: May 5, 2026, 12:00:59 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. సూర్యుడు ప్రతినెల తన రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. సూర్య సంచారంలో మార్పు వస్తే అది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి అడుగు పెడతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

Sun Transit: అలర్ట్! సూర్యుడు తన శత్రు రాశిలోకి.. ఈ రాశుల వారికి అగ్నిపరీక్షే (pinterest)
Sun Transit: అలర్ట్! సూర్యుడు తన శత్రు రాశిలోకి.. ఈ రాశుల వారికి అగ్నిపరీక్షే (pinterest)

జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, మే 15న తన శత్రు రాశి అయిన వృషభ రాశిలోకి సూర్యుడు అడుగుపెడతాడు. దీంతో కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మరి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఎవరికీ ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులకు సమస్యలు

1.వృషభ రాశి:

ఈ రాశి వారికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు పనిలో అడ్డంకులను ఎదుర్కొంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కోపం పెరుగుతుంది, ఇరిటేషన్ కలుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

2.తులా రాశి:

తులా రాశి వారికి ఈ సమయం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు సమస్యలతో సతమతం అవ్వాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి రాకపోవచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. రిలేషన్‌షిప్‌లో టెన్షన్లు పెరగవచ్చు. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. భాగస్వామితో కూడా జాగ్రత్తగా ఉండాలి.

3.మకర రాశి:

కుంభ రాశి వారికి కూడా సూర్య సంచారంలో మార్పు ఇబ్బందులను కలిగించవచ్చు. వ్యాపారంలో లాభాలు తగ్గవచ్చు. ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా డీల్స్ కుదుర్చుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి. తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe