మరో రెండు రోజుల్లో పంచమహాపురుష రాజయోగం, పన్నెండు రాశులపై ప్రభావం.. వారికి డబ్బే డబ్బు!
శుక్రుడు సంపద, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. శుక్ర సంచారంలో మార్పు రావడంతో పంచ మహాపురుష రాజయోగంలో ఒకటైన మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. 12 రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏ రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం.
గ్రహాలు కాలక్రమేణా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభయోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు వస్తే, కొన్నిసార్లు మాత్రం చాలా విధాలుగా లాభాలు కలుగుతాయి. మరో రెండు రోజుల్లో, అంటే ఏప్రిల్ 19న, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికే కారకుడు. శుక్ర సంచారంలో మార్పు వస్తే, అది ప్రత్యేకమైన యోగాలను కూడా తీసుకొస్తుంది. అది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది.

పంచ మహాపురుష రాజయోగం
ఈసారి శుక్ర సంచారంలో మార్పు రావడంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనిని పంచ మహాపురుష రాజయోగంలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పంచ మహాపురుష రాజయోగం వలన కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కెరీర్లలో కూడా మంచి మార్పులను చూస్తారు. మరి అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
పంచ మహాపురుష రాజయోగంలో ఒకటైన మాలవ్య రాజయోగం.. పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది?
మేషరాశి:
మేషరాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సంతోషంగా ఉంటారు. అదృష్టం పెరుగుతుంది. ఈ రాజయోగంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి మాలవ్య రాజయోగం ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
మిధున రాశి:
మిధున రాశి వారు బాగా ఆలోచించే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరంగా తొందరపడకండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ఆర్థికపరంగా లాభాలను తీసుకువస్తుంది. కెరీర్‌లో సక్సెస్‌ను అందుకుంటారు. మీ పనికి తగ్గ ప్రశంసలను పొందుతారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి కెరీర్ బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. మీ పనికి ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కన్య రాశి:
కన్యా రాశి వారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. ఏదైనా ప్రయాణాలు చేయడానికి ప్లాన్ వేస్తారు. మీ సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.
తులా రాశి:
తులా రాశి వారికి కాస్త మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు అయితే వస్తాయి. ఊహించని వార్తలను ఈ సమయంలో మీరు విని షాక్ అవుతారు.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కొత్త కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారు సహనంతో వ్యవహరించాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరంగా ఆలోచించకుండా మాట్లాడి మీ ప్రేమ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకోకండి. జాగ్రత్తగా వ్యవహరించండి.
మకర రాశి:
మకర రాశి వారికి ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి కెరీర్‌లో కూడా మంచి మార్పులు వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి.
కుంభ రాశి:
కుంభ రాశి వారు సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. విజయాలను అందుకుంటారు.
మీన రాశి:
మీన రాశి వారు సానుకూల మార్పులు చూస్తారు. సక్సెస్‌ను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


