Sun Transit: ఈ 5 రాశులకు మంచి రోజులు జూలై 16 నుండి ప్రారంభమవుతాయి.. సూర్యుడు చంద్రుని రాశిచక్రంలోకి ప్రవేశిస్తాడు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న సూర్యుడు జూలై 16, 2026న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. చంద్రుడి అధిపత్యంలోని కర్కాటక రాశిలోకి సూర్యుడి గోచారం వల్ల వృషభ, మిథున, కర్కాటక, కన్యా, మకర రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజుగా పిలువబడే సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ఈ సూర్య గోచారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న సూర్యుడు, జూలై 16, 2026న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు.

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడి రాశిలోకి సూర్యుడి రాక వల్ల ఐదు రాశుల జాతకులకు అద్భుతమైన మార్పులు రానున్నాయి. ఈ కాలంలో ఆర్థిక స్థితిగతులు, వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించనుంది.
సూర్య గోచార ప్రభావం: ఎవరికి లాభదాయకం?
జ్యోతిష్యుల విశ్లేషణ ప్రకారం, కర్కాటకంలోకి సూర్యుడి ప్రవేశం వల్ల ఈ క్రింది రాశుల వారికి విశేషమైన ఫలితాలు దక్కనున్నాయి:
1.వృషభ రాశి:
ఈ రాశి వారికి సూర్య సంచారం ఎంతో అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. చేపట్టిన పనుల్లో అద్భుతమైన విజయాలను అందుకుంటారు. పూర్తి ఉత్సాహంతో, సానుకూల దృక్పథంతో ఉంటారు. ప్రేమ, సంతానం, ఆరోగ్యపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది.
2.మిథున రాశి:
ఈ రాశి వారికి ఈ గోచారం శుభప్రదం. ఆర్థికంగా ఎంతో పురోగతి కనిపిస్తుంది. వృత్తిపరంగా ఎదురవుతున్న చిక్కులు తొలగిపోయి, కెరీర్‌లో సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ పరాక్రమం, ధైర్యం పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
3.కర్కాటక రాశి:
సొంత రాశిలోకి సూర్యుడి రాక జాతకులకు కలిసివస్తుంది. ఆర్థిక లాభాలు, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం.
4.కన్యా రాశి:
ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి తరుణం. చేసే ప్రయాణాలు లాభాలను తెస్తాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. భౌతిక సౌఖ్యాలు పెరుగుతాయి. మీ పని సామర్థ్యం మెరుగుపడి, నిత్యం ఉత్సాహంగా ఉంటారు.
5.మకర రాశి:
ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి. కీలకమైన వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరగడంతో పాటు పొదుపుపై దృష్టి పెడతారు. కార్యాలయంలో మీ పనితీరును చూసి పై అధికారులు ప్రశంసించే అవకాశం ఉంది.
సూర్యుడి అనుగ్రహం పొందడం ఎలా?
సూర్యుడి శుభ ఫలితాలు మరింతగా పొందడానికి పండితులు ఈ సూచనలు చేస్తున్నారు:
ఆదివారం రోజున ఉపవాసం ఉండటం వల్ల ప్రత్యేక ఫలితాలు ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
క్రమం తప్పకుండా 'ఆదిత్య హృదయ స్తోత్రం' పారాయణం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


