జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశులు మరియు నక్షత్రాల మార్పునకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా సూర్య భగవానుడు తన సంచారాన్ని మారుస్తుంటాడు. లీడర్‌షిప్, ఆత్మవిశ్వాసం, మానసన్మానాలకు కారకుడైన సూర్యుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాడు. అయితే, హిందూ పంచాంగం ప్రకారం నేటి నుంచి సూర్యుడు తన నక్షత్రాన్ని మారుస్తున్నాడు. ఆగస్ట్ 31 నుంచి సూర్య భగవానుడు 'పూర్వాఫాల్గుణి' నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
శుక్రుడి నక్షత్రంలో సూర్య సంచార విశేషాలు

పూర్వాఫాల్గుణి నక్షత్రానికి అధిపతి దైత్య గురువు శుక్రుడు. జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం, సూర్యుడు తన శత్రు లేదా మిత్ర స్థానాలకు వెళ్లే క్రమంలో నక్షత్ర మార్పు చెందడం అన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు శుక్రుడి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కేవలం సూర్య బలమే కాకుండా, శుక్రుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ నక్షత్రంలో సూర్యుడు సెప్టెంబర్ 13 వరకు కొనసాగుతాడు. ఈ 14 రోజుల కాలంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం.
మేష రాశి
మేష రాశి వారికి సూర్యుని నక్షత్ర మార్పు అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కాలంలో వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇవి భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా బలపడుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ గోచారం చాలా లాభదాయకంగా మారుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయి, ధన లాభం కలిగే బలమైన యోగాలున్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అందుతుంది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుస్తుంది. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మీలోని ప్రత్యేక నైపుణ్యాలతో ఎలాంటి క్లిష్టమైన పనులనైనా సులువుగా సాధించి విజయం అందుకుంటారు.
వృశ్చిక రాశి
{{/usCountry}}తులా రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనసు నిలుస్తుంది. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మీలోని ప్రత్యేక నైపుణ్యాలతో ఎలాంటి క్లిష్టమైన పనులనైనా సులువుగా సాధించి విజయం అందుకుంటారు.
వృశ్చిక రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారికి ఈ గోచారం ఎంతో పాజిటివ్‌గా సాగిపోతుంది. వ్యక్తిగత లేదా వృత్తిపరమైన అవసరాల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ పక్షం రోజుల కాలం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో సంతోషం, ఉత్సాహం నిండుతాయి. వ్యాపారంలో కీలకమైన డీల్స్ ఫైనల్ అవుతాయి. ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమై మనశ్శాంతి లభిస్తుంది.