గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే, నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అనేక రాశుల వారిపై ప్రభావం పడుతుంది. సూర్యుడు గ్రహాలకు రారాజు. సూర్య సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో ఉన్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మారబోతోంది. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు, టీచర్లకు కూడా ఇది అనుకూలమైన సమయం.
సూర్య సంచారం

సూర్యుడు న్యాయం, సమతుల్యత మొదలైన వాటికి కారకుడు. జాతకంలో సూర్యుడి అనుగ్రహం ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టాలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. సక్సెస్‌ను అందుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, ఇప్పుడు సూర్యుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అనేక లాభాలను తీసుకురాబోతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశుల వారికి అద్భుతాలే.
సూర్య నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి లేదు ఇక కష్టకాలం
1.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.
వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది.
2.మకర రాశి:
మకర రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.
వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. విజయాలను అందుకుంటారు.
3.మీన రాశి:
{{/usCountry}}వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. విజయాలను అందుకుంటారు.
3.మీన రాశి:
{{/usCountry}}మీన రాశి వారికి ఇది శుభ సమయం. సూర్య సంచారంతో ఈ రాశి వారు అనేక విధాలుగా మార్పులను చూస్తారు. సానుకూల మార్పులు ఉంటాయి. శుభవార్తలను వింటారు. పెళ్లైన వారు ఆనందంగా ఉంటారు. కాలేజీలో అడ్మిషన్ లభిస్తుంది. విద్యార్థులకు, టీచర్లకు కూడా ఇది అనుకూలమైన సమయం. కన్ఫ్యూజన్ తొలగిపోతుంది.