Sun Transit: ఈ మూడు రాశులకు శుభ సమయం నడుస్తోంది.. సూర్య అనుగ్రహంతో డబ్బు, అందమైన ప్రేమ జీవితం ఇలా ఎన్నో!

సూర్యుడు గ్రహాలకు రారాజు. సూర్య సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో ఉన్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మారబోతోంది. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.

Published on: Mar 20, 2026 3:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాగే, నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అనేక రాశుల వారిపై ప్రభావం పడుతుంది. సూర్యుడు గ్రహాలకు రారాజు. సూర్య సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సూర్యుడు మీన రాశిలో ఉన్నాడు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా మారబోతోంది. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు, టీచర్లకు కూడా ఇది అనుకూలమైన సమయం.

సూర్య సంచారంతో ఈ రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు (pinterest)
సూర్య సంచారంతో ఈ రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు (pinterest)

సూర్య సంచారం

సూర్యుడు న్యాయం, సమతుల్యత మొదలైన వాటికి కారకుడు. జాతకంలో సూర్యుడి అనుగ్రహం ఉంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కష్టాలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. సక్సెస్‌ను అందుకోవచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే, ఇప్పుడు సూర్యుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అనేక లాభాలను తీసుకురాబోతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో ఈ రాశుల వారికి అద్భుతాలే.

సూర్య నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి లేదు ఇక కష్టకాలం

1.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి.

వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మార్పులు వస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా కలిసి వస్తుంది.

2.మకర రాశి:

మకర రాశి వారికి సూర్య నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం.

వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఆస్తులకు సంబంధించిన చక్కటి మార్పులను చూస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. విజయాలను అందుకుంటారు.

3.మీన రాశి:

మీన రాశి వారికి ఇది శుభ సమయం. సూర్య సంచారంతో ఈ రాశి వారు అనేక విధాలుగా మార్పులను చూస్తారు. సానుకూల మార్పులు ఉంటాయి. శుభవార్తలను వింటారు. పెళ్లైన వారు ఆనందంగా ఉంటారు. కాలేజీలో అడ్మిషన్ లభిస్తుంది. విద్యార్థులకు, టీచర్లకు కూడా ఇది అనుకూలమైన సమయం. కన్ఫ్యూజన్ తొలగిపోతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More