కర్కాటకంలో సూర్య సంచారం - జూలై 30 నుంచి ఈ రాశులవారి జాతకం బంగారం కాబోతోంది..!

2026 శ్రావణ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. ఈ గ్రహ మార్పుతో మిథునం, కర్కాటకం, కన్య, మకరం, వృషభ రాశుల వారికి అదృష్టం వరిస్తుందని, విపరీతమైన ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

Published on: Jul 27, 2026, 07:26:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్య భగవానుడి రాశి పరివర్తనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సూర్యుడి సంచారం ప్రతి ఒక్కరి జీవితంపైనా, రాశిఫలాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం చంద్రుని సొంత రాశి అయిన కర్కాటకంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. కాగా… అతిత్వరలోనే పవిత్రమైన శ్రావణ మాసం (సావన్) ప్రారంభం కాబోతోంది. హిందూ క్యాలెండర్ ప్రకారం జూలై 30 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ మాసంలో అత్యధిక సమయం సూర్యుడు కర్కాటక రాశిలోనే కొలువుదీరి ఉంటాడు.

కర్కాటకంలో సూర్య సంచారం
కర్కాటకంలో సూర్య సంచారం

ఆగస్టు 17, 2026 ఉదయం వరకు సూర్యుడు కర్కాటక రాశిలోనే కొనసాగుతాడు. శ్రావణ మాసంలో శివుడికి ప్రియమైన రోజులలో సూర్యుడు చంద్రుని రాశిలో సంచరించడం కొన్ని రాశుల వారికి అమితమైన శుభఫలితాలను ఇస్తుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఈ సూర్య సంచారంతో మొత్తం 5 రాశుల జాతకం బంగారంలా ప్రకాశించబోతోంది. ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఆ అదృష్ట రాశుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

మిథున రాశి :

చంద్రుని రాశిలో సూర్య భగవానుడి సంచారం మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సమయం. వ్యాపారంలో ఊహించని పెద్ద మార్పులు వచ్చి, లాభాల బాట పడతారు. నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లల నుంచి పూర్తి సహకారం, సంతోషం లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటక రాశి :

సూర్యుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తుండటంతో ఈ రాశి వారికి రాజయోగం పడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తీపి కబురు అందుతుంది. ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి.

కన్యా రాశి :

సూర్యుని కదలికలు కన్యా రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీరు అసలు ఊహించని మార్గాల నుంచి డబ్బు వచ్చి చేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభించడమే కాకుండా ప్రత్యేక బోనస్ లేదా జీతం పెరుగుదల రూపంలో ప్రయోజనం చేకూరుతుంది.

మకర రాశి :

మకర రాశి వారికి సూర్య సంచారంతో కుటుంబంలో సంతోషాలు వికసిస్తాయి. ఇంట్లో ఐశ్వర్యం, సమృద్ధి పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దాంపత్య జీవితం మధురంగా, శృంగారభరితంగా సాగుతుంది.

వృషభ రాశి :

వృషభ రాశి వారికి సూర్యుడు శుభ వార్తలను మోసుకొస్తున్నాడు. ఇంట్లో శాంతి, ఆనందాలు వర్ధిల్లుతాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే, ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఆహార నియమాలు పాటిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం జ్యోతిష్య పండితుల కథనాలు, సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి అందించాం. దీనిని ఎంతవరకు విశ్వసించాలి అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. పూర్తి వివరాలు, వ్యక్తిగత జాతక పరిశీలన కోసం సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More