జూన్ నెలలో గ్రహాల గమనంలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడు జూన్ 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించనున్నారు. అక్కడ అప్పటికే గ్రహాల యువరాజు బుధుడు కొలువై ఉన్నారు. ఈ ఇద్దరు శక్తివంతమైన గ్రహాల కలయికతో మిథున రాశిలో అత్యంత శుభప్రదమైన 'బుధాదిత్య రాజయోగం' ఏర్పడబోతోంది.

జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు, ధైర్యానికి కారకుడిగా భావిస్తే.. బుధుడిని బుద్ధి, చాతుర్యం, వ్యాపారానికి అధిపతిగా చూస్తారు. ఈ రెండు గ్రహాలు ఒకే చోట చేరినప్పుడు జాతకులకు అపారమైన మేధస్సు, సమాజంలో ఉన్నత గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఈ రాజయోగం వల్ల ప్రధానంగా నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
1.మిథున రాశి
సూర్య, బుధుల కలయిక మీ స్వరాశిలోనే జరుగుతుండటంతో మిథున రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ప్రభుత్వ రంగం నుంచి ఆశించిన సాయం అందుతుంది. ఆర్థికంగా కలిసివచ్చే కాలం కావడంతో ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి.
2.సింహ రాశి
సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం విశేష లాభాలను తెచ్చిపెడుతుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన డబ్బు ఈ సమయంలో తిరిగి చేతికి అందుతుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సాయంతో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు.
3.కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ గ్రహాల కూటమి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, కొత్త బాధ్యతలు దక్కుతాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
4.తులా రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి ఈ గ్రహాల కూటమి శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, కొత్త బాధ్యతలు దక్కుతాయి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా పని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
4.తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి ఈ రాజయోగం అదృష్టాన్ని మోసుకొస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. కెరీర్‌లో సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ ఆర్థిక స్థితిలో ఊహించని సానుకూల మార్పులు వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.
బుధాదిత్య రాజయోగం అంటే ఏమిటి?
సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసి ఉన్నప్పుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సాధారణంగా బుధుడు ఎప్పుడూ సూర్యుడికి దగ్గరగానే సంచరిస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది జాతకాల్లో ఈ యోగం కనిపిస్తుంది.
"ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు మానవుల మేధోశక్తి, ఆలోచనా విధానం అద్భుతంగా పెరుగుతాయి. ఒకవేళ బుధుడు సూర్యుడికి మరీ దగ్గరగా వచ్చి అస్తంగత్వం చెందితే మాత్రం, ఆ వ్యక్తి సరైన సమయంలో బుద్ధిని ఉపయోగించడంలో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది," అని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వివరించారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం జ్యోతిష్య నమ్మకాలు, పండితుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంది. దీనిని కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. పూర్తి వివరాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.