...
...
Next Story

తులారాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశుల వారికి కష్టాలు తప్పవా? పరిహారాలివే

అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ప్రభావంతో నవంబర్ 16 వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక, మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశముంది.

Published on: Oct 16, 2026, 15:51:07 IST
Advertisement

వైదిక జ్యోతిషశాస్త్రంలో గ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడి గోచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆత్మకారకుడు, ధైర్యం, పితృకారకుడు మరియు శక్తికి ప్రతీకగా భాసించే సూర్యుడు త్వరలోనే తన రాశిని మార్చబోతున్నాడు. జ్యోతిష పంచాంగం ప్రకారం…. 2026 అక్టోబర్ 17న సూర్యుడు తన నీచ రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. రాబోయే 30 రోజుల పాటు, అంటే 2026 నవంబర్ 16 వరకు సూర్యభగవానుడు ఇదే రాశిలో సంచరిస్తాడు.

సూర్య గోచారం 2026
సూర్య గోచారం 2026

సాధారణంగా తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు బలహీనుడవుతాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. దీనివల్ల ఆయన అందించే శుభఫలితాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ గోచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను ఇచ్చినప్పటికీ…. మరికొన్ని రాశుల వారు మాత్రం తీవ్ర జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. సూర్యుని ఈ సంచారం వల్ల ఏ ఏ రాశుల వారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటారో ఇక్కడ తెలుసుకోండి….

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ సూర్య సంచారం కొన్ని ఇబ్బందులను తీసుకురావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అన్యాపదేశంగా కొన్ని మానసిక ఆందోళన కలిగించే వార్తలు వినాల్సి రావచ్చు. అనవసరమైన వ్యయాలు పెరగడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ధన విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారు తాము చేపట్టే పనుల్లో అనవసర అడ్డంకులను ఎదుర్కొంటారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభనష్టాలు హెచ్చుతగ్గులుగా ఉంటాయి. కుటుంబంలో, ముఖ్యంగా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలకు అవరోధాలు కలగడం, అనుకోని ఖర్చులు రావడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

వృశ్చిక రాశి

మీన రాశి వారికి సూర్యుని తులారాశి సంచారం ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మానసిక ఆందోళనలు, అంతర్గత కలహాలు వేధిస్తాయి. ఉద్యోగ ప్రదేశంలో లేదా కార్యాలయంలో కొద్దిగా ఒత్తిడి వాతావరణం నెలకొంటుంది. ఉన్నతాధికారుల అసంతృప్తికి గురికావాల్సి రావొచ్చు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం.

సూర్య గ్రహ దోష నివారణకు పరిహారాలు :

సూర్యుని నీచ సంచారం వల్ల కలిగే అశుభ ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం కొన్ని సులభమైన పరిహారాలను సూచిస్తోంది….

  • ప్రతి ఆదివారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి, పేదలకు బెల్లం, శనగలు వంటి వాటిని దానం చేయాలి.
  • ప్రతిరోజూ ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
  • సూర్యానుగ్రహం పొందేందుకు నిత్యం లేదా కనీసం ప్రతి ఆదివారం 'ఆదిత్య హృదయ స్తోత్రం' పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks