తులారాశిలో సూర్య సంచారం - ఈ 4 రాశుల వారికి మహాలక్ష్మీ యోగం, ఊహించని ధనలాభం!

అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడంతో బుధ, శుక్రులతో కలిసి త్రిగ్రహ కూటమి ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన రాజయోగాల వల్ల 4 రాశుల వారికి అపార ధనలాభం, వృత్తిలో పురోగతి లభిస్తాయి.

Published on: Oct 13, 2026, 10:20:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జ్యోతిష్య క్యాలెండర్ ప్రకారం… గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు అక్టోబర్ 17, 2026న కన్యారాశిని వీడి తులారాశిలోకి అడుగుపెడతాడు. ఈ సంచారం వేద జ్యోతిష్యంలో ఒక అరుదైన ఘటనకు దారితీస్తోంది. తులారాశిలో ఇప్పటికే శుక్రుడు, బుధుడు ఉన్నారు. ఇప్పుడు సూర్యుడి కలయికతో తులారాశిలో ఒకేసారి శక్తివంతమైన రాజయోగాలు రూపుదిద్దుకుంటున్నాయి.

తులారాశిలో సూర్య గోచారం
తులారాశిలో సూర్య గోచారం

సూర్యుడు-బుధుల కూటమి…. 'బుధాదిత్య రాజయోగాన్ని', సూర్యుడు-శుక్రుల సంయోగం 'శుక్రాదిత్య రాజయోగాన్ని' ఇస్తాయి. అలాగే శుక్ర-బుధుల కలయిక వల్ల ఏర్పడిన 'లక్ష్మీ నారాయణ యోగం' లేదా 'మహాలక్ష్మీ ధన యోగం' ఇప్పటికే కొలువై ఉంది. ఈ త్రిగ్రహాల అద్భుత కలయిక వల్ల మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశులపై శుభ, అశుభ ప్రభావాలు ఉంటాయి. కానీ, ప్రధానంగా నాలుగు రాశుల జాతకులకు మాత్రం ఇది సువర్ణ సమయం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1. కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ గ్రహాల సంచారం ఆర్థికంగా విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా రావలసిన బాకీలు ఈ సమయంలో తిరిగి మీ చేతికి అందుతాయి. కుటుంబంలో ఉన్న పాత సమస్యలు, కలహాలు క్రమంగా తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతులు లభించి, వేతనం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తలు వినే సమయం. మీ వృత్తిపరమైన జీవితం అత్యంత బలంగా మారుతుంది. ఆత్మీయులు, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది.

2. సింహ రాశి

సింహ రాశి జాతకుల్లో ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ధైర్య సాహసాలు, తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఆఫీసులో మీరు ఆశించిన ఫలితాలను సాధించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఉపశమనం పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా బలపడే సూచనలు ఉన్నాయి. అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

3. తులా రాశి

సూర్య, బుధ, శుక్రుల కలయిక సొంత రాశి అయిన తులారాశిలోనే జరుగుతుండటంతో, వీరికి అత్యంత అనుకూలమైన కాలం నడుస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట, గౌరవ మర్యాదలు గణనీయంగా పెరుగుతాయి. పని ప్రదేశంలో మీకు నూతన బాధ్యతలను అప్పగిస్తారు, వాటిని మీరు అత్యంత సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరును చూసి ఉన్నతాధికారులు మురిసిపోతారు, ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి. పాత మార్గాల నుంచి కూడా ధనాగమనం ఉంటుంది. కొత్తగా ఏదైనా వ్యాపారం లేదా ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలమైనది.

4. మకర రాశి

మకర రాశి వారి జీవితంలో ఈ త్రిగ్రహ యోగం సానుకూల మార్పులను నింపుతుంది. ఉద్యోగ రంగంలో పురోగతి సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీ ప్రతిభకు తగినట్లుగా ఆఫీసులో కొత్త బాధ్యతలు లేదా కీలకమైన ప్రాజెక్టులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. రాబడి పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భౌతిక సుఖాలు, సౌకర్యాలు పెరుగుతాయి. ఆస్తి, భూమి, ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేయడానికి బలమైన యోగం కనిపిస్తోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More