జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడిని గ్రహాల రాజుగా కొలుస్తారు. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పితృకారకుడు మరియు ఆత్మకారకుడిగా సూర్యుడిని భావిస్తారు. నిర్దిష్ట కాల వ్యవధిలో సూర్యుడు తన రాశులను, నక్షత్రాలను మారుస్తుంటాడు. ప్రస్తుతం విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్న సూర్య భగవానుడు, రాబోయే నవంబర్ 19, 2026న అనురాధ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 3, 2026 వరకు సూర్యుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు.

జ్యోతిష్య పరంగా చూస్తే సూర్య, శనిలు తండ్రీ కొడుకులే అయినప్పటికీ, ఇద్దరి మధ్య సహజ శత్రుత్వం ఉంటుంది. ఈ రెండు బలమైన గ్రహాల శక్తి పరస్పరం తలపడినప్పటికీ, అన్ని రాశులపై ఇది ప్రతికూల ప్రభావాన్నే చూపుతుందని చెప్పలేం.
జాతకంలో సూర్యుడి స్థానాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. వైదిక గణాంకాల ప్రకారం, సూర్యుడి ఈ నక్షత్ర మార్పు దాదాపు 4 రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ఈ కాలంలో వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, వృత్తి జీవితంలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఈ నక్షత్ర మార్పు శుభ సమయాన్ని తీసుకువస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, నిలిచిపోయిన పాత బాకీలు చేతికి అందుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారంతో గృహంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. మనసుకు నచ్చిన శుభవార్త వినడంతో రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం ఆర్థికంగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి రావడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఆరోగ్య పరంగా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు కూడా తగ్గిపోయి ఉత్సాహం వస్తుంది.
కన్య రాశి
కన్య రాశి జాతకులకు జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ఇది సరైన సమయం. ఆప్తుల నుంచి సకాలంలో తగిన సహాయసహకారాలు అందుతాయి. ధన సంపాదనకు సంబంధించి కొత్త అవకాశాలు తారసపడతాయి. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వేటలో ఉన్నవారికి త్వరలోనే మంచి అవకాశం దక్కవచ్చు.
మీన రాశి
{{/usCountry}}కన్య రాశి జాతకులకు జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ఇది సరైన సమయం. ఆప్తుల నుంచి సకాలంలో తగిన సహాయసహకారాలు అందుతాయి. ధన సంపాదనకు సంబంధించి కొత్త అవకాశాలు తారసపడతాయి. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగినప్పటికీ, వాటిని సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ వేటలో ఉన్నవారికి త్వరలోనే మంచి అవకాశం దక్కవచ్చు.
మీన రాశి
{{/usCountry}}మీన రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఎంతో పురోగతిని ఇస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ పటాపంచలవుతాయి. పనిలో ఒత్తిడి తగ్గి మనస్శాంతి లభిస్తుంది. మీ పనితీరును చూసి పైఅధికారులు ప్రత్యేకంగా అభినందిస్తారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీలోని ధైర్యసాహసాలు పెరగడంతో పెండింగ్ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.