...
...
Next Story

ఈరోజు సూర్య గ్రహణం వేళ కుజుడి నక్షత్ర మార్పుతో ఈ 3 రాశులకు స్వర్ణయుగం.. ధనలాభం, విజయాలే!

అమావాస్య సందర్భంగా ఏర్పడే సూర్యగ్రహణంతో పాటు కుజుడు రాహువు అధిపత్యంలోని ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంచారం కన్య, తులా, మీన రాశులకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాల విషయంలో అనుకూల ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.

Published on: Aug 12, 2026, 09:30:23 IST
Advertisement

ఆకాశంలో అరుదైన ఖగోళ మార్పులు దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఈ ఏడాది అమావాస్య రోజున ఏర్పడుతున్న సూర్యగ్రహణం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో గ్రహాల సేనాపతిగా భావించే కుజుడు రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 2 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచరించనున్నాడు.

ఈరోజు సూర్య గ్రహణం వేళ కుజుడి నక్షత్ర మార్పుతో ఈ 3 రాశులకు స్వర్ణయుగం.. ధనలాభం, విజయాలే!
ఈరోజు సూర్య గ్రహణం వేళ కుజుడి నక్షత్ర మార్పుతో ఈ 3 రాశులకు స్వర్ణయుగం.. ధనలాభం, విజయాలే!

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అంచనా ప్రకారం, గ్రహణ రోజున కుజుడు నక్షత్రం మార్చడం వల్ల కొన్ని రాశుల వారికి మానసిక ఆందోళనలు, ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, మరికొన్ని అదృష్ట రాశుల వారికి మాత్రం ఇది స్వర్ణయుగంగా మారుతుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలంలో అంతులేని ధనలాభం, వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయి.

పండితులు చెబుతున్న వివరాల ప్రకారం, కుజుడు తన గమనాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం వ్యక్తుల జాతకాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో కుజుని సంచారం కన్య, తులా, మీన రాశుల వారికి అపారమైన లాభాలను తెచ్చిపెట్టనుంది. ఈ సమయంలో మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయమే మీ సొంతం అవుతుంది.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ కాలంలో అదృష్టం పూర్తిగా వెన్నంటి ఉంటుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు మళ్లీ వేగంగా పూర్తవుతాయి. మీ పనితీరును గమనించిన ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించడంతో పాటు, కొత్త ప్రాజెక్టులు లేదా కీలక బాధ్యతలను అప్పగిస్తారు. మీకు ఏ సమయంలో ఏ వనరులు అవసరమో అవి ఇట్టೇ సమకూరుతాయి. ఆర్థిక ప్రణాళికలు సజావుగా సాగి మంచి లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి సరికొత్త అవకాశాలు తారసపడతాయి.

తులా రాశి

మీన రాశి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ పరాక్రమం, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు ఏ పని తలపెట్టినా నలుమూలల నుంచి విజయాలు వరిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది సరైన సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

కుజుడిని శక్తి, సాహసానికి ప్రతీకగా చెబుతారు. రాహువు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని సందర్భాల్లో కుజుడి శక్తి చాలా దూకుడుగా మారుతుంది. కాబట్టి కోపంతో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు. ఏ పని చేసినా క్రమశిక్షణతో, ఏకాగ్రతతో ముందుకు సాగాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks