...
...
Next Story

స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే చాలా అదృష్టవంతులు.. సంపద కూడా పెరుగుతుంది!

స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. ఇవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఇలాంటి కలలు వచ్చే వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో అనేక మార్పులు చూస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, సంపద పెరుగుతుంది. మనకు వచ్చే కలలు కొన్ని శుభంగా, కొన్ని అశుభంగా భావిస్తారు.

Published on: Jan 20, 2026, 12:00:41 IST
Advertisement

మనం నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. అయితే. కలలు కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని ఏ మాత్రం గుర్తుండవు. కొన్ని కలలు కేవలం అదృష్టవంతులకు మాత్రమే వస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కలల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా కొన్ని కలలు చెబుతూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే మాత్రం అదృష్టవంతులని చెప్పచ్చు. ఇవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి.

ఇలాంటి కలలు వచ్చే వారు చాలా అదృష్టవంతులు.. సంపద కూడా పెరుగుతుంది (pinterest)
ఇలాంటి కలలు వచ్చే వారు చాలా అదృష్టవంతులు.. సంపద కూడా పెరుగుతుంది (pinterest)

ఇలాంటి కలలు వచ్చే వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో అనేక మార్పులు చూస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, సంపద పెరుగుతుంది. మనకు వచ్చే కలలు కొన్ని శుభంగా, కొన్ని అశుభంగా భావిస్తారు. అయితే, ఇలాంటి కలలు వస్తే మాత్రం దేవుని ప్రత్యేక అనుగ్రహం మనపై ఉందని అర్థం చేసుకోవాలి. మరి ఎలాంటి కలలు వస్తే అదృష్టమో తెలుసుకుందాం. కేవలం అదృష్టవంతులకే ఇలాంటి కలలు వస్తాయి. వీటి వల్ల సంపద కూడా పెరుగుతుంది.

ఇలాంటి కలలు వస్తే చాలా అదృష్టవంతులు.. సంపద కూడా పెరుగుతుంది

దేవాలయం:

కలలో దేవాలయం కనపడితే శుభ ఫలితాలు కలుగుతాయి. దేవాలయ మెట్లు ఎక్కుతున్నట్లు కల వచ్చినా, లేదంటే దేవుని విగ్రహం వంటివి కలలో కనపడినా శుభ ఫలితాలు ఎదురవుతాయని అర్థం. దీని వలన ప్రతికూలత తొలగిపోతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వచ్చినట్లయితే చాలా మంచి జరుగుతుంది.

తామర పువ్వు, కామధేనువు లేదా తెల్లని పాలు:

కలలో తామర పువ్వు, కామధేనువు లేదా తెల్లటి పాలు కనపడితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోవాలి. కష్టాలన్నీ తొలగిపోతాయి. సక్సెస్‌ను అందుకుంటారని అర్థం.

తెల్లటి ఆవు:

స్వప్న శాస్త్రం ప్రకారం ఆకాశంలో ఎగురుతున్నట్లు కల వస్తే శుభ ఫలితాలు ఎదురవుతున్నాయని అర్థం. ఇలాంటి కల వస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇలాంటి కల వచ్చినట్లయితే నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది.

బంగారం, వెండి, విలువైన ఆభరణాలు:

కలలో బంగారం, వెండి లేదా విలువైన ఆభరణాలు కనపడినట్లయితే అదృష్టవంతులని చెప్పచ్చు. ఇలాంటి కలలు వస్తున్నట్లయితే ధనవంతులు అవుతారు. వ్యాపారస్తులకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

శివలింగం, వెలుగుతున్న దీపం, ఓంకారం:

కలలో ఓంకారం, వెలుగుతున్న దీపం లేదా శివలింగం కనపడితే కూడా మంచి జరుగుతుందని అర్థం. ఇవి సమాజంలో గౌరవ మర్యాదలను పెంపొందిస్తాయి. జీవితంలో చీకటి తొలగిపోయి ఆనందం ఉంటుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe