ప్రతి మనిషి జీవితంలో ప్రశాంతతను, సంతోషాన్ని కోరుకుంటాడు. అయితే కొన్ని సార్లు తెలియకుండా చేసే పొరపాట్లు, సరైన అవగాహన లేకపోవడమే వారి జీవితంలో పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. మహానుభావుడు ఆచార్య చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో మానవ జీవితాన్ని సులభతరం చేసే అనేక అమూల్యమైన సూత్రాలను ప్రసాదించారు.

నాటి కాలంలో చెప్పిన ఈ నీతులు నేటి ఆధునిక కాలానికి కూడా వంద శాతం సరిపోతాయి. మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు దారుణమైన నష్టాన్ని, మానసిక క్షోభను మిగులుస్తాయని చాణక్యుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా జీవితాన్ని నరకప్రాయం చేసే ఆ మూడు ప్రధాన కష్టాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అజ్ఞానం లేదా మూర్ఖత్వం ఒక పెద్ద శాపం
సరైన జ్ఞానం లేకపోవడం లేదా మూర్ఖంగా వ్యవహరించడం మనిషి జీవితంలో మొదటి మరియు అత్యంత పెద్ద కష్టమని ఆయన హెచ్చరించారు. లోకజ్ఞానం కొరవడినప్పుడు మనిషి అడుగువద్ద తప్పులు చేస్తూ జీవితాంతం ఇబ్బందుల పాలవుతాడు. సరైన సమాచారం, అవగాహన లేని వ్యక్తి ఏ రంగంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేడు. చదువు ఒక్కటే కాదు.. బంధాలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారంలో విజ్ఞత లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం కూడా అజ్ఞానమేనని చాణక్య నీతి చెబుతోంది.
అదుపు తప్పుతున్న యౌవనం - తెచ్చిపెట్టుకునే ముప్పు
యూత్ అంటేనే అంతులేని ఉత్సాహం, శక్తి మరియు సరికొత్త అవకాశాల సమయం. అయితే ఈ వయస్సులో జోష్‌తో పాటు విచక్షణ, సంయమనం చాలా అవసరమని చాణక్యుడు గుర్తుచేశారు. ఒకవేళ యౌవనంలో ఒడుపు లేకపోతే, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతే మనిషి తప్పుడు మార్గంలో పయనించి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. సంయమనం కోల్పోయిన యౌవనం మనిషికి మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుంది.
పరాయి ఇళ్లల్లో తలదాచుకోవడం - మనుషులకే అతి పెద్ద వేదన
అజ్ఞానం, అదుపులేని యౌవనం కష్టకరమైనవే అయినప్పటికీ.. వాటన్నింటికంటే మించి అత్యంత బాధాకరమైన విషయం మరొకటి ఉంది. అదే "పరగేహ నివాసనం" అనగా సొంత ఇల్లు ఉండి కూడా ఇతరుల ఆశ్రయంలో, పరాయి ఇళ్లల్లో బతకాల్సి రావడం.
{{/usCountry}}అజ్ఞానం, అదుపులేని యౌవనం కష్టకరమైనవే అయినప్పటికీ.. వాటన్నింటికంటే మించి అత్యంత బాధాకరమైన విషయం మరొకటి ఉంది. అదే "పరగేహ నివాసనం" అనగా సొంత ఇల్లు ఉండి కూడా ఇతరుల ఆశ్రయంలో, పరాయి ఇళ్లల్లో బతకాల్సి రావడం.
{{/usCountry}}చాణక్యుని ప్రకారం, ఎదుట వారి ఇంటిలో ఎవరికీ స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉండదు. ప్రతి క్షణం భయం, బిడియం ఆవరించి ఉంటాయి. ఎదుటివారి అభిరుచులు, పరిస్థితులకు తగినట్లుగా సర్దుకుపోవాల్సి రావడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. అందుకే సొంతిల్లు లేక పరాయివారి నీడన బతకడం మనిషికి నరకంతో సమానమని చాణక్యుడు అభివర్ణించారు.