మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పచ్చు. ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మరొకరితో పోల్చుకుంటే కాస్త భిన్నంగానే ఉంటారు. ఒకరి ఆలోచన విధానం ఒకలా ఉంటే, మరొకరి ఆలోచన విధానం ఇంకోలా ఉంటుంది.

కొంతమందికి కొన్ని విషయాలు తప్పు అయితే, అవే కొంత మందికి ఒప్పు కావచ్చు. నలుగురితో కొంతమంది కలిసిపోయి సరదాగా సమయాన్ని గడిపితే, ఇంకొంతమందికి ఏకాంతంగా ఉండడం ఇష్టం. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశుల వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి.
ఈ రాశుల వారు చాలా భిన్నంగా ఉంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. కొంతమందికి ఒంటరిగా ఉండడం ఏమాత్రం నచ్చదు. అందరితో కలిసి సరదాగా సమయాన్ని గడపాలని అనుకుంటారు. మరి కొంతమంది మాత్రం ఒంటరిగా ఉండాలని, ఒంటరిగా సమయాన్ని గడపాలని భావిస్తారు. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు.
కన్యా రాశి
కన్యా రాశి వారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఈ రాశి వారు పరిపూర్ణతను కోరుకుంటారు. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా పర్‌ఫెక్ట్‌గా చేస్తారు. చిన్న విషయాలను కూడా గమనిస్తారు. తప్పు చేయడం, తప్పు రావడం వీరికి ఏమాత్రం నచ్చదు. ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని గడపాలని కన్యా రాశి వారు కోరుకుంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు వారి ఆలోచనలను సరిచేసుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. అంతేకాదు, పుస్తకాలు చదవడం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కోసం కూడా ఒంటరిగా ఉంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి భావోద్వేగాలు బాగా ఎక్కువగా ఉంటాయి. లోతైన ఆలోచనను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఏ విషయాన్నైనా కూడా లోతుగా విశ్లేషించగలరు. ఎక్కువసేపు జనాల మధ్య ఉండడం కంటే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని భావిస్తారు. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి కూడా ఏకాంతాన్ని ఈ రాశి వారు ఇష్టపడతారు.
మకర రాశి
{{/usCountry}}వృశ్చిక రాశి వారి భావోద్వేగాలు బాగా ఎక్కువగా ఉంటాయి. లోతైన ఆలోచనను కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఏ విషయాన్నైనా కూడా లోతుగా విశ్లేషించగలరు. ఎక్కువసేపు జనాల మధ్య ఉండడం కంటే ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని భావిస్తారు. ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి కూడా ఏకాంతాన్ని ఈ రాశి వారు ఇష్టపడతారు.
మకర రాశి
{{/usCountry}}ఈ రాశి వారు క్రమశిక్షణకు మారుపేరు. బాధ్యత, లక్ష్య సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు కూడా ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్ట పడతారు. చాలామందికి వీరు కాస్త దూరంగా ఉన్నట్లు అనిపించొచ్చు. కానీ వీరు జీవితానికి, సమయానికి ఎంతో విలువ ఇస్తారు. అనవసరమైన సమావేశాలు, అనవసరపు మాటలు వీరికి నచ్చవు. దాని కంటే కూడా పనిని పూర్తి చేసుకోవడం మంచిదని భావిస్తారు. భవిష్యత్తు కోసం మకర రాశి వారు అహర్నిశలు శ్రమిస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు వినూత్నంగా ఆలోచిస్తారు. ఈ రాశి వారికి క్రియేటివిటీ కూడా ఎక్కువ. కొత్త ఆలోచనలు, సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెడతారు. ఈ రాశి వారు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అవసరమైనప్పుడు మాత్రమే సమాజంతో కలుస్తారు. లేకపోతే వారి పని వారు చూసుకుని ఒంటరిగా ఉంటారు. అన్నిటికంటే కూడా వ్యక్తిగత సమయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.