శివుడుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని, శివుని అనుగ్రహం ఉంటే కష్టాలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. అయితే త్వరలోనే శివరాత్రి రాబోతోంది. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించి అభిషేకం చేయడం, బిల్వపత్రాలను సమర్పించడం, శివరాత్రి నాడు జాగారం చేయడం వంటి రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. వీటిని పాటించడం వలన మహా శివుని ప్రత్యేక ఆశీస్సులు కలుగుతాయని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారంటే శివుడికి ఎంతో ఇష్టం. ఎల్లప్పుడూ ఈ రాశుల వారికి శివుని అనుగ్రహం ఉంటుంది. దాంతో ఎంతటి కష్టాన్నైనా సులువుగా దాటేస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారు ఎల్లప్పుడూ శివుని అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు.. ఎలాంటి కష్టాలైనా సులువుగా దాటేస్తారు
కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి ఎల్లప్పుడూ శివుని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశికి అధిపతి చంద్రుడు. శివుడు తన శిరస్సుపై చంద్రుడిని ధరిస్తాడు. అందువల్ల ఎప్పుడూ శివుడు ఈ రాశి వారిని రక్షిస్తాడు. కష్టాలను సులువుగా దాటేస్తారు. కర్కాటక రాశి వారు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ఎవరైనా బాధపడితే దానిని అంత త్వరగా మరిచిపోలేరు.
తులా రాశి:
తులా రాశి వారు కూడా ఎల్లప్పుడూ శివుని అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు ప్రేమ, సంతోషం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. ఈ రాశి వారు కూడా ఎల్లప్పుడూ శివుని ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు. తులా రాశి వారు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వారి హాబీలు, వారి కోరికల కోసం డబ్బును ఖర్చు పెట్టడానికి ఆలోచించరు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
మకర రాశి:
మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారికి కూడా శివుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తారు. కష్టాన్ని నమ్ముకుంటారు కానీ అదృష్టాన్ని నమ్ముకోరు. వారు ఏ రంగంలోకి అడుగుపెట్టినా ఆ రంగంలో సక్సెస్‌ను అందుకుంటారు. అనుకున్న వాటిని పూర్తి చేస్తారు.
కుంభ రాశి:
{{/usCountry}}మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారికి కూడా శివుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాశి వారు ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తారు. కష్టాన్ని నమ్ముకుంటారు కానీ అదృష్టాన్ని నమ్ముకోరు. వారు ఏ రంగంలోకి అడుగుపెట్టినా ఆ రంగంలో సక్సెస్‌ను అందుకుంటారు. అనుకున్న వాటిని పూర్తి చేస్తారు.
కుంభ రాశి:
{{/usCountry}}కుంభ రాశి వారికి కూడా శివుని ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కుంభ రాశి వారిని శివుడు రక్షిస్తాడు. ఈ రాశి వారి జీవితంలో సంతోషం, డబ్బు ఉండేటట్లు చూస్తాడు. ఈ రాశి వారు బాగా కష్టపడి పనిచేస్తారు. పెద్ద సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు.