సాధారణంగా మొక్కలు ఇంటికి అందాన్ని ఇస్తాయి. కానీ, మన సనాతన ధర్మంలో కొన్ని మొక్కలకు దైవిక శక్తి ఉందని విశ్వసిస్తాం. వాస్తు శాస్త్రం ప్రకారం, సరైన దిశలో సరైన మొక్కలను నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఈ మొక్కలను నాటడం వల్ల విశేష పుణ్యఫలాలు లభిస్తాయి.
ఇంటికి అదృష్టాన్ని తెచ్చే 5 మొక్కలు
1. బిల్వ వృక్షం:

శివయ్యకు అత్యంత ఇష్టమైనది బిల్వదళం. ఇంట్లో బిల్వ మొక్కను నాటడం అంటే సాక్షాత్తు శివుడిని ఇంట్లోకి ఆహ్వానించడమే. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. దీనిని ఇంటికి దక్షిణ లేదా తూర్పు దిశలో నాటడం అత్యంత శుభప్రదం.
2. శమీ వృక్షం (జమ్మి చెట్టు):
ధనానికి, రక్షణకు ప్రతీక శమీ వృక్షం. ఇది శని దేవుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన మొక్క. దీనిని ఇంటికి తీసుకురావడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఇంటి ఈశాన్య మూలలో శమీ మొక్కను నాటి, ప్రతిరోజూ దీపం వెలిగిస్తే కుటుంబంలో స్థిరత్వం, ఐశ్వర్యం లభిస్తాయి.
3. తులసి మొక్క:
తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ఇది ఇంటికి ప్రధాన రక్షక కవచం. ప్రతికూల శక్తులను పారద్రోలి, ఇంట్లో పాజిటివ్ వైబ్స్‌ను నింపుతుంది. ప్రధాన ద్వారం వద్ద లేదా పూజా గది దగ్గర తులసిని పెంచడం ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4. హరిసింగర్ (పారిజాతం):
అద్భుతమైన సుగంధాన్ని వెదజల్లే పారిజాత పుష్పాలు ఇంటికి ఎంతో శోభను తెస్తాయి. వాస్తు ప్రకారం, పారిజాత మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం వల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది. ఈ మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
5. లక్ష్మణ మొక్క:
పేరుకు తగ్గట్టుగానే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. దీనిని ఇంటికి తీసుకు రావడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. దీనిని ఆగ్నేయ దిశలో నాటడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి.
{{/usCountry}}పేరుకు తగ్గట్టుగానే ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. దీనిని ఇంటికి తీసుకు రావడం వల్ల ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయి. దీనిని ఆగ్నేయ దిశలో నాటడం వల్ల ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరిస్తాయి.
{{/usCountry}}నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పుకోము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.