వ్యాపార వాస్తు టిప్స్: కుబేర దిశ, గణపతి అనుగ్రహంతో ఆర్థికాభివృద్ధి సాధించండి!

వ్యాపారంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే, వాస్తు దోషాలు కూడా ఒక కారణమని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. కార్యాలయంలో లేదా వ్యాపార ప్రాంగణంలో సానుకూల శక్తి ప్రవాహం ఉండేలా చిన్నచిన్న మార్పులు చేస్తే ఆర్థిక పురోగతి సాధించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

Published on: Jul 10, 2026, 16:01:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవేశించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించడం వల్ల ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

వ్యాపార వాస్తు టిప్స్: కుబేర దిశ, గణపతి అనుగ్రహంతో ఆర్థికాభివృద్ధి సాధించండి! (pinterest)
వ్యాపార వాస్తు టిప్స్: కుబేర దిశ, గణపతి అనుగ్రహంతో ఆర్థికాభివృద్ధి సాధించండి! (pinterest)

వ్యాపారంలో లాభాలు రావట్లేదా?

వాస్తు శాస్త్రం సూచించే చిన్న మార్పులతో అద్భుతాలను చూడొచ్చు. వ్యాపారం అంటేనే నిజానికి ఎంతో పెట్టుబడి పెట్టి, అనుభవాన్ని రంగరించి, పగలు-రాత్రి కష్టపడినా కూడా ఆశించినంత ఫలితం దక్కదు. అలాంటి సమయంలో తీవ్ర నిరాశ కలగడం సహజమే. ఇలాంటి సందర్భాల్లో చాలామందికి తోచని విషయం వాస్తు దోషాలు. ఆఫీస్ లేదా వ్యాపార స్థలంలో శక్తి ప్రవాహం సరిగ్గా లేకపోయినట్లయితే ఆర్థిక నష్టాలు, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వంటివి చూడొచ్చు. వ్యాపార స్థలంలో చిన్న మార్పులు చేయడం వల్ల ఆర్థిక అభివృద్ధిని సాధించొచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాపార వృద్ధి యంత్రం

వాస్తు శాస్త్రంలో వ్యాపార వృద్ధి యంత్రానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఇది సానుకూల శక్తిని ఆకర్షించడమే కాదు, ఆర్థిక పునాదినే బలోపేతం చేస్తుంది. ఈ యంత్రాన్ని శుభముహూర్తంలో మీ కార్యాలయంలో స్థాపించి, నిత్యం భక్తితో ఆరాధించండి. ఇలా చేస్తే వ్యాపారంలో కొత్త అవకాశాలు పెరుగుతాయి. లాభాల బాట సుగమమవుతుంది.

ఉత్తర దిశ

వాస్తు ప్రకారం ఉత్తర దిశను కుబేరుడి స్థానం అంటారు. అంటే సంపదకు చిహ్నం. ఈ దిశలో దోషాలు ఉంటే వ్యాపారవేత్తలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఫీసులో ఉత్తర దిశ గోడపై కుబేరుడి చిత్రాన్ని పెట్టినట్లయితే అన్ని సవ్యంగా మారుతాయి. ఈ దిశలో లాకర్లు లేదా కౌంటర్లను పెట్టండి.

గణపతి అనుగ్రహం ఉండాలి

కార్యాలయంలో శ్వేతార్క గణపతిని స్థాపించండి. ఒక కన్ను కలిగిన శ్రీఫలం ఉంచడం కూడా లాభదాయకం. క్రమం తప్పకుండా దీపారాధన చేసి, వారానికి ఒకసారి నైవేద్యం పెట్టినట్లయితే శుభ ఫలితాలను చూడొచ్చు. అలాగే వ్యాపార ప్రాంగణంలో సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది.

వ్యాపార రకాన్ని బట్టి గుర్తులు ఉండేటట్టు చూసుకోండి

ప్రతి వ్యాపారానికి ప్రత్యేకమైన శక్తి అనేది ఉంటుంది. వ్యాపార రకాన్ని బట్టి కొన్ని చిహ్నాలను పాటిస్తే ఫలితాలు త్వరగా అందుతాయి.

హోటల్ లేదా ఆహార వ్యాపారం చేసేవారు కార్యాలయంలో గోమాత విగ్రహాన్ని పెట్టడం మంచిది.

ఎలక్ట్రానిక్స్ వ్యాపారులు స్పటికాలను వాడడం వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి.

సూర్యనారాయణమూర్తి ఫోటోను పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

అలాగే ఆఫీసులో లోహంతో చేసిన తాబేలును పెడితే స్థిరత్వం, ఆర్థిక పురోగతి చూడొచ్చు.

విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పంచజన్య శంఖాన్ని స్థాపించి, ప్రతిరోజూ పూజించండి.

ప్రధాన ద్వారం

ఏ వ్యాపారం చేసే వారైనా ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉండేటట్టు చూసుకోవడం మంచిది. ఈశాన్యం లేదా వాయువ్యం దిశలు కూడా శుభ ఫలితాలను తీసుకొస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More