...
...
Next Story

ఈ 5 రాశుల వారు చాలా లక్కీ.. సరైన సమయంలో అదృష్టం తలుపుతడుతుంది!

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. అలాంటి రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, సంబంధాలు, కెరీర్ వంటి విషయాల్లో అనుకూల అవకాశాలు లభిస్తాయని చెబుతారు. ఈ జాబితాలో ధనస్సు, సింహం, తులా, వృషభం, మీనం రాశులు ఉన్నాయి.

Published on: Aug 13, 2026, 16:00:48 IST
Advertisement

మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం, డబ్బు, జీవితంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఊహించని మార్పులను జీవితంలో చూస్తూ ఉంటారు. ఈరోజు అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ 5 రాశుల వారు చాలా లక్కీ.. సరైన సమయంలో అదృష్టం తలుపుతడుతుంది! (pinterest)
ఈ 5 రాశుల వారు చాలా లక్కీ.. సరైన సమయంలో అదృష్టం తలుపుతడుతుంది! (pinterest)

కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అదృష్టం వారి వెంట ఉండడంతో ఏదైనా బాగా పూర్తి చేస్తారు. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి. ఈ రాశుల వారికి అదృష్టం బాగా ఎక్కువ. ఈ లిస్టులో మీరు ఉన్నారా?

ధనస్సు రాశి

అదృష్టం, జ్ఞానానికి ప్రత్యేకంగా భావించే గురువు ధనస్సు రాశికి అధిపతి. అదృష్టవంతమైన రాశుల జాబితాలో ధనస్సు రాశి వారు మొదటి స్థానంలో ఉన్నారు. ధనస్సు రాశి వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వీరు జీవితంలో సానుకూల అనుభవాలను, సహాయం చేసే వ్యక్తులను ఆకర్షిస్తారు. అలాగే ధనస్సు రాశి వారు కెరీర్‌లో ఊహించని మార్పులను చూస్తారు. సంబంధాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం ఎప్పుడూ వీరిని అనుసరిస్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సూర్యుడు సింహరాశికి అధిపతి. కనుక ఈ రాశి వారికి అదృష్టం ఎప్పుడూ విపరీతంగానే ఉంటుంది.

సింహ రాశి వారు తరచూ అందరి దృష్టిని ఆకర్షించగలరు. విజయం, గుర్తింపు, ప్రశంసలు వీరికి ఎప్పుడూ దక్కుతూనే ఉంటాయి. వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు అదృష్టాన్ని తీసుకువస్తాయి.

తులా రాశి

ఈ రాశికి కూడా అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిని కూడా అదృష్టం ఎప్పుడూ వెంటాడుతుంది. ఈ రాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రిలేషన్‌షిప్‌లో సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. ఎల్లప్పుడూ ఏ విషయంలో కూడా ఇబ్బంది కలగదు. ఒకవేళ కలిగినా వెంటనే దాని నుంచి బయటపడగలరు.

మీన రాశి

మీన రాశికి అధిపతి గురువు. మీన రాశి వారు కూడా ఎప్పుడూ అదృష్టంతో ఉంటారు. ఈ రాశి వారికి పూర్తి అదృష్టం ఉంటుంది. ఎలాంటి సమస్యలనైనా ఇట్టే పరిష్కరించగలరు. అవకాశాలను కూడా వెంటనే వారి వైపు మార్చుకుని విజయాలను అందుకుంటారు. అదృష్టం ఎప్పుడూ ఎక్కువగా ఉండటంతో ఓటమి అనేది ఉండదు. అన్నిటిలో బాగా రాణించగలరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks