...
...
Next Story

పుట్టుకతోనే జాలీగా ఉంటారు.. ఈ 5 రాశుల వారికి జీవితం అంటే పండగే!

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం రాశుల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వ తీరు, వారి జీవనశైలి వంటి విషయాలను అంచనా వేయవచ్చు. కొన్ని రాశుల వారు జీవితంలోని ప్రతి క్షణాన్ని సరదాగా, సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంటారు. వారి సమయస్ఫూర్తి, తెలివితేటలతో కష్టాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటారు.

Published on: Sep 15, 2026, 16:00:51 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని రాశుల వారు ఎప్పుడూ సరదాగా, సంతోషంగా ఉంటారు. కొన్ని రాశుల వారు జీవితాన్ని అంతలా ఎంజాయ్ చేయలేరు. ఈ రాశుల వారు మాత్రం జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో ఎప్పుడూ టాప్‌లో ఉంటారు. ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి.

జీవితాన్ని ఎంజాయ్ చేసే రాశులు ఇవే

పుట్టుకతోనే జాలీగా ఉంటారు.. ఈ 5 రాశుల వారికి జీవితం అంటే పండగే! (AI)
పుట్టుకతోనే జాలీగా ఉంటారు.. ఈ 5 రాశుల వారికి జీవితం అంటే పండగే! (AI)

రాశుల వారు ఉత్సాహంగా, సరదాగా సమయాన్ని గడుపుతారు. జీవితమంటే కష్టసుఖాల సమరం అయితే, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తే మాత్రం జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని రాశుల వారు పుట్టుకతోనే జీవితాన్ని పండగలా జరుపుకుంటూ ఉంటారు. వారి సమయస్ఫూర్తి, తెలివితేటలతో జీవితంలో ఎదురయ్యే సవాళ్లను కూడా అవకాశంగా మార్చుకుంటారు. ప్రతిక్షణం సంతోషంగా, సరదాగా, ఉత్సాహంగా ఉంటారు.

సింహ రాశి

సింహ రాశి వారు ఎప్పుడూ సరదాగా, సంతోషంగా ఉంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఏ సాధారణ సందర్భాన్నైనా పండగలా మార్చుకుంటారు. ఎటువంటి దాపరికాలు లేకుండా సంపూర్ణంగా జీవించడానికి సింహ రాశి వారు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాగే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు. ఏ వేడుకనైనా ఘనంగా జరుపుకోవాలని సింహ రాశి వారు అనుకుంటారు.

వృషభ రాశి

వృషభ రాశి వారు కూడా జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. మంచి మ్యూజిక్, చక్కటి ఆహారం ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించడానికి వృషభ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చిన్న చిన్న విలాసాలను కూడా ఈ రాశి వారు ఆస్వాదిస్తూ ఉంటారు.

మిథున రాశి

మీన రాశి వారు కూడా జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేయడానికి ముందుంటారు. అలాగే ఎక్కువగా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకుంటారు. కలలు, ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం మీన రాశి వారికి మహా ఇష్టం.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే, ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి వారు స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారు. ప్రయాణాలను ఇష్టపడతారు. డబ్బు సంపాదించడం కంటే కూడా అనుభవాలను ఏర్పరచుకోవడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. కొత్త సంస్కృతులను తెలుసుకోవడానికి కూడా ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks