ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పరిహారాలను పాటించడం, వస్తువులను తీసుకు రావడం, మొక్కలను నాటడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే నిజానికి కొన్ని వస్తువులు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఈ వస్తువులు ఇంట్లో ఉండడం వలన అదృష్టం రెట్టింపు అవుతుంది, దేనికి లోటు ఉండదు. సమస్యలు కూడా తగ్గుతాయి. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మరి ఎలాంటి వస్తువులను ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు వస్తాయి, వాటి వలన ఎలాంటి ఫలితాన్ని చూడొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వస్తువులను ఇంట్లో పెడితే సానుకూల శక్తి పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది
తులసి మొక్క

తులసి మొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టండి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దేనికి లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
దీపం
వేకువజామున, సాయంత్రం పూట ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది. దీపం వెలిగించడం వలన మానసిక ప్రశాంతత ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది.
ఉప్పు
ఇంట్లో ఏదో ఒక మూలలో రాతి ఉప్పును పెట్టండి. ఒక గిన్నెలో రాతి ఉప్పును ఉంచడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అదే విధంగా అనేక లాభాలను పొందవచ్చు.
తాజా పువ్వులు
ఇంట్లో ప్రతిరోజు తాజా పువ్వులను పెట్టండి. ఇవి సానుకూల శక్తిని తీసుకొస్తాయి. ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. వీటి సువాసన ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ధూపం
ఇంట్లో కర్పూరం లేదా ధూపం వెలిగిస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కావాలనుకుంటే సెంటెడ్ క్యాండిల్స్‌ను కూడా వెలిగించవచ్చు. ఇవి కూడా సానుకూల శక్తిని పెంచుతాయి.
విండ్ చైమ్స్
వీటిని ఇంట్లో తగిలించండి. ఇవి ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతాయి. ఇంటి వాయువ్య దిశలో వీటిని పెట్టితే శుభ ఫలితాలు కలుగుతాయి.
నెమలీకలు
{{/usCountry}}వీటిని ఇంట్లో తగిలించండి. ఇవి ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతాయి. ఇంటి వాయువ్య దిశలో వీటిని పెట్టితే శుభ ఫలితాలు కలుగుతాయి.
నెమలీకలు
{{/usCountry}}నెమలీకలు అదృష్టాన్ని పెంచుతాయి. ఇవి శుభ చిహ్నాలు. కాబట్టి వీటిని ఇంట్లో పెట్టడం మంచిది.
వాటర్ ఫౌంటెన్
ఇంట్లో నీటికి సంబంధించిన వస్తువులు పెడితే మంచి ఫలితాలను చూడొచ్చు. వాటర్ ఫౌంటెన్‌ను ఇంటి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు పెట్టండి. సానుకూల శక్తి, అదృష్టం కలుగుతాయి. ఆనందం కూడా పెరుగుతుంది.
వినాయకుడు, బుద్ధుడి విగ్రహాలు
ఇంట్లో వినాయకుడు లేదా బుద్ధుడి విగ్రహాలు పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంకా ఎన్నో లాభాలు పొందవచ్చు.