...
...
Next Story

Lucky Rasis: ఈ రాశుల వారి వెంటే విజయం ఉంటుంది, ఓటమే తెలీదు!

రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా మనం భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని రాశులవారు కొన్ని విషయాల్లో ముందుంటారు, కొన్ని రాశుల వారు మరి కొన్ని విషయాల్లో ముందుంటారు. ఈ రాశుల వారు ఎందులో అడుగుపెడితే, అందులో విజయం సాధిస్తారు.

Published on: Nov 12, 2025, 13:30:14 IST
Advertisement

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఏ విధంగా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా మనం భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పవచ్చు. కొన్ని రాశులవారు కొన్ని విషయాల్లో ముందుంటారు, కొన్ని రాశుల వారు మరి కొన్ని విషయాల్లో ముందుంటారు.

Lucky Rasis: ఈ రాశుల వారి వెంటే విజయం ఉంటుంది (pinterest)
Lucky Rasis: ఈ రాశుల వారి వెంటే విజయం ఉంటుంది (pinterest)

కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, కొన్ని రాశుల వారికి ఒక అడుగు దూరంలో ఓటమి ఎదురవుతుంది. ఈ రాశుల వారు మాత్రం ఎంతో అదృష్టవంతులని చెప్పొచ్చు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం వీరిదే. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు, ఎప్పుడూ ఓటమి తెలియని ఆ రాశుల వారి గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు ఒకరేమో చూసుకోండి.

ఈ రాశుల వారు ఎందులో అడుగుపెడితే, అందులో విజయం సాధిస్తారు

కొన్ని రాశుల వారు సులభంగా విజయాలను అందుకుంటారు. పట్టుదలతో ట్రై చేస్తే కచ్చితంగా సక్సెస్ అందుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం చూసినట్లయితే ఈ రాశుల వారికి పట్టుదల ఎక్కువ. ఏ రంగంలో అడుగుపెడితే ఆ రంగంలో విజయాన్ని సాధిస్తారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు, దేనిలో అడుగుపెడితే ఏ రాశుల వారికి విజయం దక్కుతుందో తెలుసుకుందాం.

1.వృషభ రాశి:

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా పట్టుదలతో ట్రై చేస్తూ ఉంటారు. ఓర్పు, స్థిరత్వం కలిగి ఉంటారు. అప్పుడప్పుడు కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ పక్క విజయాన్ని అందుకుంటారు. మీరు మంచి ప్లాన్‌తో ముందుకు వెళ్తారు. అదే వీరిని విజయవంతంగా మార్చుతుంది. మీరు పనిని విజయవంతంగా పూర్తి చేసేలా చూస్తుంది.

2.వృశ్చిక రాశి:

కన్య రాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు కూడా ఎంతో పట్టుదలతో ట్రై చేస్తారు. వ్యాపారంలో కూడా సక్సెస్‌ను అందుకుంటారు. ఈ రాశి వారు బాగా తెలివైన వారు కూడా. ప్రతి పనిని ప్లాన్‌తో పూర్తి చేస్తారు. విద్య, వైద్య, సేవా రంగాల్లో బాగా రాణించగలరు.

4.సింహ రాశి:

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. సహజంగా నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. పుట్టుకతోనే మంచి నాయకులు. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ రంగంలో అయినా ఈజీగా విజయాన్ని చేరుకుంటారు. వీరికి ఓటమి అంటే ఏమాత్రం నచ్చదు. అందుకే కష్టపడి ట్రై చేస్తారు, విజయాన్ని చేరుకునే వరకు వదిలిపెట్టరు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks