ఈ రాశుల వారు ఎమోషన్స్‌ను ఏ మాత్రం బయట పెట్టడానికి ఇష్టపడరు!

రాశుల ఆధారంగా వ్యక్తిత్వం, తీరు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. ఈ రాశుల వారు ఎమోషన్స్‌ను ఏ మాత్రం బయట పెట్టరు. ఇతరులకి ఎప్పుడూ తమ బాధలను, భావాలను తెలపరు.

Published on: Nov 11, 2025, 12:00:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా విభిన్నమైన లక్షణాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తిత్వం ఒకలా ఉంటే, మరి కొంత మంది వ్యక్తిత్వం మరోలా ఉంటుంది. అయితే కొన్ని రాశుల వారు వారి భావాలను ఏ మాత్రం బయటపెట్టరు.

ఈ రాశుల వారు ఎమోషన్స్‌ను ఏ మాత్రం బయట పెట్టరు (pinterest)
ఈ రాశుల వారు ఎమోషన్స్‌ను ఏ మాత్రం బయట పెట్టరు (pinterest)

భావోద్వేగాలను రహస్యంగా దాచుకోవడం బలహీనత అని చెప్పొచ్చు, కానీ ఒక్కోసారి అది బలం కూడా అవుతుంది. వీళ్ల మనసులో ఏముందనేది ఎవరు తెలుసుకోలేరు. అయితే మరి ఆ రాశుల వారు ఎవరు? ఎమోషన్స్‌ను ఏ రాశి వారు రహస్యంగా దాచుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశుల వారు ఎమోషన్స్‌ను ఏ మాత్రం బయట పెట్టరు

1.కన్య రాశి:

కన్య రాశి వారు ఎదుటి వారికి అన్ని విషయాలను చెప్పరు. వారు ఏదైనా చెప్పాలనుకుంటే, ఆ వ్యక్తులకు మాత్రమే చెబుతారు; మిగిలిన వాటిని రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారు వారి బలహీనతలను ఇతరులకు చూపించాలని అనుకోరు. ఇతరులకి బలహీనత చూపించడం కంటే, ఒంటరిగా బాధను అనుభవించడమే మంచిదని భావిస్తారు. ఎమోషన్స్‌ను మాత్రం ఎప్పుడూ బయటపెట్టడానికి ఇష్టపడరు.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారు ఎవరినైనా పూర్తిగా నమ్మితే కానీ వారి మనసులోని భావాలను బయటకు చెప్పరు. ప్రతి ఒక్కరినీ నమ్మరు. వీరు ఇతరులను నమ్మడానికి కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇతరులకి ఎప్పుడూ తమ బాధలను, భావాలను తెలపరు.

3.తులా రాశి:

తులా రాశి వారు కూడా వారి ఎమోషన్స్‌ను అంత ఈజీగా బయటపెట్టరు. ఇతరులతో వారి భావాలను చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎమోషన్స్‌ను దాచేస్తారు. చాలా అరుదుగా మాత్రమే ఆలోచనలను, భావాలను పంచుకుంటారు.

4.కుంభ రాశి:

కుంభ రాశి వారు భావాలు, సంబంధాల గురించి ఇతరులకు చెప్పరు. ఇతరులతో మాట్లాడడానికి కొంత ఆందోళన చెందుతారు. అందుకే వారి వ్యక్తిత్వాన్ని ఇతరుల ముందు బయటపెట్టరు. ఎవరైనా వారితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, బదులుగా టాపిక్‌ను మార్చేస్తారు. చాలా అరుదుగా మాత్రమే పంచుకుంటారు.

5.వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు కూడా అంత ఈజీగా ఎవరిని నమ్మరు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోరు. ఒకవేళ జీవితంలో ఎవరైనా ప్రత్యేకమని అనిపిస్తే, వారితో మాత్రమే తమ భావాలను చెప్తారు. అందరితో వారు ఎమోషన్స్‌ను పంచుకోవడానికి ఇష్టపడరు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More