మృదుస్వభావం, మర్యాద, ఆప్యాయత ఈ రాశుల వారిలో పుష్కలంగా ఉంటాయి.. అందుకే అందరూ ఫిదా అవుతారు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి సహజంగానే మృదుస్వభావం, మర్యాద, స్నేహపూర్వక వైఖరి ఉంటాయి. ముఖ్యంగా వృషభ, మీన, తులా రాశుల వారు తమ మాటలు, ప్రవర్తన, సహానుభూతితో ఇతరుల మనసును సులభంగా గెలుచుకుంటారని చెబుతారు.
ఒక్కో మనిషి ఒక్కో విధంగా ఉంటారు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పవచ్చు. భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది.

కొంతమంది వ్యక్తులను కలిసిన వెంటనే వారి ప్రవర్తన, మాటలు, ఆప్యాయత మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. వారితో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వారు మాట్లాడే తీరు, స్నేహపూర్వక స్వభావం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, ఈ రాశుల వారు కేవలం మాటలతోనే కాదు, తమ ప్రవర్తనతో కూడా అందరి మనసును గెలుచుకుంటారు. సహజంగా ఎంతో మర్యాదగా, ఆకర్షణీయంగా ఉంటారు. మరి ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
ఈ రాశుల వారు ఇతరుల మనసును ఇట్టే గెలుచుకుంటారు.. వీరి ప్రవర్తన అందరికీ నచ్చుతుంది
1.వృషభ రాశి
వృషభ రాశి వారు అందరినీ తమ స్వభావంతో ఆకట్టుకుంటారు. స్థిరంగా ఉంటారు. సరళమైన జీవితాన్ని ఈ రాశి వారు ఇష్టపడతారు. ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసే మనస్తత్వం ఈ రాశి వారికి ఉంటుంది. మృదువుగా మాట్లాడతారు. అలాగే ప్రశాంతంగా వ్యవహరిస్తారు.
అందుకే వీరిని కలిసిన వెంటనే ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దకుండా, ఎదుటివారి మాటలను ఓపికగా వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలామందికి వీరిని సులభంగా నమ్మి, మనసులోని మాటలు చెప్పుకోవాలని ఉంటుంది.
2.మీన రాశి
మీన రాశి వారు సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల దయతో ఉంటారు. ఎదుటివారి భావోద్వేగాలను సులభంగా అర్థం చేసుకోగలరు. అలాగే పరిస్థితికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. ఎలాంటి సమయంలో అయినా సరే జాగ్రత్తగా ఉంటారు.
ఎప్పుడు ఏం మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అలాగే సహానుభూతి కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇతరులకు బాగా చేరువవుతారు. అలాగే ఇతరులను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాన్ని ఈ రాశి వారు ఏర్పరచుకుంటారు.
3.తులా రాశి
తులా రాశి వారు సమతుల్యత, అవగాహనకు ప్రతీకగా భావిస్తారు. ఎలాంటి విషయం అయినా సరే తొందరపడకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు. బాగా ఆలోచిస్తారు. వీరి స్నేహపూర్వక స్వభావం కారణంగా అందరికీ నచ్చేస్తారు.
అందరినీ ఇట్టే గెలుచుకుంటారు. సంభాషణలో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే వీరు మాట్లాడే తీరు కూడా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తమ ప్రవర్తనతో అందరికీ బాగా దగ్గరవుతారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


