...
...
Next Story

మే 14 వరకు ఈ రాశులకు అద్భుతాలే.. డబ్బు, ఆస్తులు, వాహనాలు, శుభవార్తలతో పాటు ఎన్నో ఊహించని లాభాలు!

జ్యోతిష్య శాస్త్రంలో విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 19న తన సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించాడు. దీనివల్ల ఏర్పడే అత్యంత శక్తివంతమైన ‘మాళవ్య రాజయోగం’ మే 14 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా ఆర్థికంగానూ భారీ లాభాలు ఉంటాయి.

Published on: Apr 20, 2026, 14:01:05 IST
Advertisement

నవగ్రహాలలో అత్యంత శుభప్రదుడు, ప్రేమ, ఐశ్వర్యం మరియు విలాసాలకు కారకుడు అయిన శుక్రుడు తన ప్రయాణాన్ని మార్చుకున్నాడు. హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ 19, ఆదివారం మధ్యాహ్నం 03:51 గంటలకు శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. వృషభ రాశికి శుక్రుడే అధిపతి కావడం విశేషం. తన స్వక్షేత్రంలోకి అడుగుపెట్టిన శుక్రుడు అక్కడ మే 14వ తేదీ ఉదయం 10:56 గంటల వరకు కొలువుదీరుతాడు.

మే 14 వరకు ఈ రాశులకు అద్భుతాలే.. డబ్బు, ఆస్తులు, వాహనాలు, శుభవార్తలతో పాటు ఎన్నో
మే 14 వరకు ఈ రాశులకు అద్భుతాలే.. డబ్బు, ఆస్తులు, వాహనాలు, శుభవార్తలతో పాటు ఎన్నో

సొంత రాశిలో శుక్రుడు ఉండటం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన ‘మాళవ్య రాజయోగం’ ఏర్పడింది. ఈ యోగం వల్ల సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు, కళారంగంలో రాణింపు వంటి సానుకూల ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఒక ‘గోల్డెన్ పీరియడ్’ అని చెప్పవచ్చు.

మాళవ్య రాజయోగం అంటే ఏమిటి?

జ్యోతిష్య నిపుణుల ప్రకారం, శుక్రుడు తన స్వక్షేత్రం (వృషభం, తుల) లేదా ఉచ్చ రాశి (మీనం)లో ఉండి.. జాతక చక్రంలోని కేంద్ర భావాలైన 1, 4, 7, 10 స్థానాల్లో నిలిచినప్పుడు ‘మాళవ్య రాజయోగం’ ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్నవారు అపారమైన ధనసంపదలతో పాటు సుఖమయమైన జీవితాన్ని గడుపుతారు.

శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు

1. కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వీటిని సమర్థవంతంగా పూర్తి చేయడం ద్వారా ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే ఛాన్స్ ఉంది. వివాహ జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. భాగస్వామితో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసుకోవాలి. సరైన ఆహారం, నిద్ర అవసరం.

2. మకర రాశి:

కన్యా రాశి వారికి ఈ కాలం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారికి తిరుగుండదు. ఊహించని విధంగా ధన లాభం కలిగే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి రిటర్న్స్ ఇస్తాయి. మీ లవ్ లైఫ్ ఎంతో రొమాంటిక్‌గా సాగుతుంది. మీ మనసులోని మాటను వ్యక్తం చేయడానికి ఇది మంచి సమయం. బ్యాంకింగ్, రైటింగ్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks