Lucky Rasis: ఈరోజు వాలెంటైన్స్ డే వేళ ఈ రాశుల వారు ప్రేమలో సక్సెస్ అవ్వచ్చు.. ఆ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా?
ఈరోజు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. శుక్రుడు అనుకూలంగా ఉంటే ప్రేమ జీవితంలో విజయాలు ఉంటాయి. పెళ్లిళ్లు జరుగుతాయి. మరి ఈ వాలెంటైన్స్ డే నాడు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ప్రేమ ప్రయత్నాల్లో ఏ రాశుల వారు విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ డే నాడు చాలా మంది తమ ప్రేమను ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తారు. శుక్రుడు సంపద, డబ్బు, సుఖం, ప్రేమ, పెళ్లి, శృంగార జీవితం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు ఫిబ్రవరి 6న మిత్రక్షేత్రమైన కుంభరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 1 వరకు శుక్రుడిపై గురువు దృష్టి పడుతుంది. ఫిబ్రవరి 14 అంటే ఈరోజు వాలెంటైన్స్ డే.

ఈరోజు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. శుక్రుడు అనుకూలంగా ఉంటే ప్రేమ జీవితంలో విజయాలు ఉంటాయి. పెళ్లిళ్లు జరుగుతాయి. మరి ఈ వాలెంటైన్స్ డే నాడు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది? ప్రేమ ప్రయత్నాల్లో ఏ రాశుల వారు విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశుల వారు ప్రేమ ప్రయత్నాల్లో పూర్తి విజయాన్ని పొందుతారు.. ఏ అడ్డంకులు ఉండవు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడు ఉండడం వలన బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సిరి సంపదలను పొందుతారు. ప్రేమ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ప్రేమ గురించి బయటపెడితే కచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. ప్రేమ నుంచి పెళ్లికి వెళ్లాలనుకునే వారికి కూడా ఇది అద్భుత సమయం.
2.మేష రాశి:
మేష రాశి వారికి సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి వాలెంటైన్స్ డే బాగా కలిసి వస్తుంది. విందులు, వినోదాలతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితాన్ని పొందాలనుకునే వారు కూడా ప్రేమ జీవితాన్ని ప్రారంభిస్తారు. ప్రేమలో ఉన్న వారు పెళ్లి వరకు వెళ్తారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.
3.మిథున రాశి:
మిథున రాశి వారికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం ఉండడం వలన బాగా కలిసి వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే దూరపు బంధువులు లేదా విదేశాల్లో ఉన్నవారితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న వారి బంధం పెళ్లి వరకు వెళ్లొచ్చు. వైవాహిక జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది.
4.సింహ రాశి:
సింహ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రేమలో పడొచ్చు. ప్రేమలో ఉన్న వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మీకు కూడా వాలెంటైన్స్ డే కి శుభ ఫలితాలు ఉంటాయి,
5.తులా రాశి:
తులా రాశి వారికి పంచమ స్థానంలో శుక్ర సంచారం జరగడంతో ఈ రాశి వారికి కూడా బాగుంటుంది. మీ బంధువుల్లో ఒకరిని చూసి ఇష్టపడవచ్చు. ప్రేమ కచ్చితంగా సక్సెస్ అవుతుంది. పెళ్లి వరకు కూడా వెళ్తుంది. వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది.
6.మకర రాశి:
మకర రాశి వారికి కుటుంబ స్థానంలో ప్రవేశించిన శుక్రుడిని గురువు చూడడంతో తోటి ఉద్యోగి లేదా పరిచయస్తుడితో ప్రేమలో పడొచ్చు. స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడతారు. సుఖసంతోషాలు ఉంటాయి. పెళ్లయిన వారి దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












