కలియుగంలో ప్రజలను రక్షించడానికి విష్ణు స్వయంగా వెంకటేశ్వర స్వామి అవతారాన్ని ఎత్తాడు. భక్తులు “గోవిందా గోవిందా” అని జపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని బలంగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి వారు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలసినారు. ప్రపంచంలోనే అత్యంత ధనికమైన, ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే ఆలయాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి.

ఇక్కడ తలనీలాలు సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఎంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథోత్సవం వంటివి జరుపుతారు. వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం.
తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం
చాలా మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళాలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఆలయంలో విరాళాలు ఇస్తే భక్తులు కొన్ని అవకాశాలను పొందుతారు. దర్శనం, ప్రసాదం ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే కలుగుతాయి. మరి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇచ్చే విరాళాల వలన భక్తులు కలిగే అవకాశాల గురించి తెలుసుకుందాం.
ఇక్కడ భక్తులు రూపాయి నుంచి కోటి ఆపై ఎంతైనా కూడా ఇవ్వచ్చు. ఒక రోజు అన్నదానం చేయాలంటే 44 లక్షల రూపాయలు ఇవ్వాలి. అల్పాహారానికి 10 లక్షలు, మధ్యాహ్నం భోజనానికి 17 లక్షలు, రాత్రి 17 లక్షలు ఇవ్వాలి.
శ్రీవారి సేవలో తరిస్తూ.. విశేష దర్శన భాగ్యం!
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి విరాళాలు అందించడం భక్తులు ఒక మహద్భాగ్యంగా భావిస్తారు. భక్తులు ఇచ్చే ఈ విరాళాలను టీటీడీ అన్నదానం, ప్రాణదానం, విద్యా దానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. అయితే, ఇలా విరాళాలు ఇచ్చే దాతలను గౌరవిస్తూ, వారి భక్తికి ప్రతిఫలంగా టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. లక్ష రూపాయల ప్రారంభ విరాళం నుంచి కోటి రూపాయల పైబడిన విరాళాల వరకు దాతలకు లభించే లడ్డూ ప్రసాదాలు, వసతి మరియు దర్శన వివరాలను తెలుసుకుందాం.
ఒక లక్ష నుంచి 5 లక్షలు
{{/usCountry}}కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి విరాళాలు అందించడం భక్తులు ఒక మహద్భాగ్యంగా భావిస్తారు. భక్తులు ఇచ్చే ఈ విరాళాలను టీటీడీ అన్నదానం, ప్రాణదానం, విద్యా దానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంది. అయితే, ఇలా విరాళాలు ఇచ్చే దాతలను గౌరవిస్తూ, వారి భక్తికి ప్రతిఫలంగా టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంది. లక్ష రూపాయల ప్రారంభ విరాళం నుంచి కోటి రూపాయల పైబడిన విరాళాల వరకు దాతలకు లభించే లడ్డూ ప్రసాదాలు, వసతి మరియు దర్శన వివరాలను తెలుసుకుందాం.
ఒక లక్ష నుంచి 5 లక్షలు
{{/usCountry}}ఎవరైనా భక్తులు ఒక లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు విరాళం ఇస్తే, వారికి ఐదుగురితో కలిసి సుపథం ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు రూ. 100 విలువైన గదిలో వసతి, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా మరియు జాకెట్ ముక్కను అందజేస్తారు.
5 లక్షల నుంచి 10 లక్షలు
ఇక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు విరాళం ఇస్తే, ఆ సదుపాయాలు మరింత పెరుగుతాయి. ఏడాదిలో మూడు రోజుల పాటు ఐదుగురికి సుపథం ద్వారా దర్శన భాగ్యం. వీరికి 10 చిన్న లడ్డూలు, ఐదు మహాప్రసాదాలతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.
10 నుంచి 25 లక్షలు:
ఐదుగురికి మూడు రోజుల పాటు బ్రేక్ దర్శనం లభిస్తుంది. రూ. 1000 విలువైన గదిలో వసతితో పాటు 20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు ఇస్తారు. అదనంగా 50 గ్రాముల వెండి నాణెం ఇస్తారు.
25 నుంచి 50 లక్షలు:
వీరికి మూడు రోజుల బ్రేక్ దర్శనంతో పాటు, ఒక రోజు సుపథం దర్శనం అదనంగా లభిస్తుంది. వీరికి రూ. 1500 విలువైన వసతి గదిని కేటాయిస్తారు. ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం కానుకగా అందుతాయి.
50 నుంచి 75 లక్షలు:
ఒక రోజు సుప్రభాత సేవ (ఐదుగురికి), మూడు రోజుల బ్రేక్ దర్శనం, రెండు రోజుల సుపథం దర్శనం లభిస్తాయి. రూ. 2000 విలువైన గది, బంగారు డాలర్, వెండి కాయిన్ ఇస్తారు.
75 లక్షల నుంచి కోటి:
వీరికి రెండు రోజుల సుప్రభాత సేవ, నాలుగు రోజుల సుపథం, మూడు రోజుల బ్రేక్ దర్శనం లభిస్తాయి. వీరికి ఒక రోజు వేద ఆశీర్వచనం కూడా ఉంటుంది.
కోటి రూపాయలకు పైగా:
కోటి లేదా అంతకంటే ఎక్కువ విరాళం ఇచ్చే దాతలకు మూడు రోజుల సుప్రభాత సేవ, మూడు రోజుల బ్రేక్ దర్శనం, నాలుగు రోజుల సుపథం దర్శన భాగ్యం కల్పిస్తారు. పది చిన్న లడ్డూలు, 20 పెద్ద లడ్డూలు, పది మహాప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనం, 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం అందిస్తారు.