...
...
Next Story

Today Horoscope: ఈరోజు అశ్వినీ నక్షత్రం+ ప్రీతి యోగం.. ఆ రాశుల వారు విజయాలను సాధిస్తారు.. తీపి కబురు వింటారు!

Today Horoscope: ఏప్రిల్ 18, 2026 శనివారం నాడు గ్రహగతులు మారుతున్నాయి. అశ్వినీ నక్షత్రం, ప్రీతి యోగం ప్రభావంతో మీ రాశిపై ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకోండి. ఈ రోజు పరమశివుడుని, హనుమంతుడిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు చూడచ్చు.

Published on: Apr 18, 2026, 04:00:15 IST
Advertisement

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు నిరంతరం మారుతూ మన జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఏప్రిల్ 18, 2026 శనివారం అనగా ఈరోజు విశేషమైన గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు అశ్వినీ నక్షత్రంతో పాటు 'ప్రీతి యోగం' కూడా తోడవుతోంది. శనివారం అనగానే మనం శని దేవుడిని స్మరించుకుంటాం. కానీ, ఈ రోజు పరమశివుడు, హనుమంతుడిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మరి మీ రాశి చక్రం ప్రకారం రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు

Today Horoscope: ఈరోజు అశ్వినీ నక్షత్రం+ ప్రీతి యోగం.. ఆ రాశుల వారు విజయాలను సాధిస్తారు
Today Horoscope: ఈరోజు అశ్వినీ నక్షత్రం+ ప్రీతి యోగం.. ఆ రాశుల వారు విజయాలను సాధిస్తారు

మేష రాశి: ఈరోజు మీకు కొంచెం అలసటగా ఉండవచ్చు. శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే, వ్యక్తిగత బంధాల విషయంలో రోజు చాలా బాగుంటుంది. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నా, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల మళ్ళీ ఉత్సాహంగా మారతారు.

వృషభ రాశి: మీ కెరీర్ గ్రాఫ్ మెరుగుపడుతోంది. ఆఫీసులో పై అధికారులతో లేదా పెద్దలతో వాదనలకు దిగకండి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోజు సులభంగా గడిచిపోతుంది.

మిథున రాశి: మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఏదైనా తీపి కబురు వినే అవకాశం ఉంది. బంధుమిత్రులతో గడిపే సమయం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పనిలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, చివరికి అది మీకు మేలు చేస్తుంది. కుటుంబంతో కలిసి గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటక రాశి: ఈ రోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి, లేదంటే చిన్నపాటి గొడవలు రావచ్చు. ఓర్పుగా ఉంటే పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయి.

కన్యా రాశి: అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. ముఖ్యంగా గొంతు లేదా ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అయితే, కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యాన్ని ఇస్తుంది. వేడి పానీయాలు తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

తులా రాశి: నేడు తులా రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల కొంచెం చికాకుగా అనిపించవచ్చు. ఓవర్‌థింకింగ్ మానుకోండి. ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఆర్థిక వ్యవహారాల్లో అజాగ్రత్త వద్దు. ఊహించని ఖర్చులు లేదా నష్టాలు రావచ్చు. ఇతరులతో గొడవలకు దిగకండి. పనులు యధావిధిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.

ధనుస్సు రాశి: మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కెరీర్‌లో ముందుకు వెళ్లేందుకు మంచి అవకాశాలు తలుపు తడతాయి. కాకపోతే మనసులో ఏదో తెలియని అశాంతి ఉండవచ్చు. సానుకూల దృక్పథంతో ఉంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మకర రాశి: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. బంధాల్లో వాదోపవాదాలకు తావివ్వకండి. శాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు.

కుంభ రాశి: నేడు కుంభ రాశి వారి కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

మీన రాశి: మనసులో భయం లేదా ఆందోళన నెలకొంటుంది. బంధాల్లో చిన్నపాటి ఒత్తిడి ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని మీరు పనుల్లో బిజీగా ఉంచుకుంటే ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe