జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక పాలక గ్రహం ఉంటుంది. దాని ప్రభావం మన దైనందిన జీవితంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 27వ తేదీన చంద్రుడు మరియు ఇతర గ్రహాల స్థితి కొన్ని రాశుల వారికి అపారమైన శక్తిని ఇస్తుంటే, మరికొందరిని ఆలోచనల్లో పడేస్తోంది.
ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి:

ఈరోజు మీలో పని చేయాలనే ఉత్సాహం, శక్తి మెండుగా ఉంటాయి. ఉదయం నుంచే పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని భావిస్తారు. అయితే, మీ వేగానికి ఇతరులు సహకరించనప్పుడు కొంత చిరాకు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఓపిక పట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో రోజు బాగున్నా, తొందరపాటు నిర్ణయాలు వద్దు.
వృషభ రాశి:
రోజువారీ పనులు మీకు కొంత భారంగా లేదా విసుగుగా అనిపించవచ్చు. ఏదైనా కొత్తగా చేయాలనే తపన మీలో కలుగుతుంది. మీ పని విధానంలో చిన్న మార్పులు చేసుకోవడం వల్ల రోజు ఉత్సాహంగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
మిథున రాశి:
ఈ రోజు మీ ముందుకు అనేక పనులు, బాధ్యతలు ఒకేసారి రావచ్చు. అన్నింటికీ 'అవును' అని చెప్పడం వల్ల ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. మీకు సాధ్యమైన పనులను మాత్రమే స్వీకరించండి. ఆర్థిక పరంగా చిన్నపాటి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం.
కర్కాటక రాశి:
ఈరోజు కర్కాటక రాశి వారు కొంత భావోద్వేగానికి గురవుతారు. చిన్న విషయాలు కూడా మీ మనసును బాధించవచ్చు. బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా, లోలోపల ఏదో వెలితిగా అనిపిస్తుంది. జనాల మధ్య ఉండటం కంటే కొంత సమయం ఒంటరిగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపడం మంచిది. పనులను నిదానంగా పూర్తి చేయండి.
సింహ రాశి:
పని ప్రదేశంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. అందరూ మీ మాట వింటారు, దీనివల్ల పనులు వేగవంతం అవుతాయి. అయితే, ఈ క్రమంలో అహంకారం తలకెక్కకుండా చూసుకోవడం ముఖ్యం. మీరు ఎంత సమతుల్యంగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. కెరీర్ పరంగా ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కన్యా రాశి:
{{/usCountry}}పని ప్రదేశంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. అందరూ మీ మాట వింటారు, దీనివల్ల పనులు వేగవంతం అవుతాయి. అయితే, ఈ క్రమంలో అహంకారం తలకెక్కకుండా చూసుకోవడం ముఖ్యం. మీరు ఎంత సమతుల్యంగా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం పొందుతారు. కెరీర్ పరంగా ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కన్యా రాశి:
{{/usCountry}}నేడు కన్య రాశి వారికి బాధ్యతల భారం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ, మీరు వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అయితే, మిమ్మల్ని మీరు మరీ ఎక్కువగా శ్రమ పెట్టుకోకండి. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.
తులా రాశి:
చిన్న చిన్న విషయాలపై మీరు చూపే శ్రద్ధ ఈ రోజు మీ బలంగా మారుతుంది. ఏ పని చేసినా అందులో మెరుగుదల కనిపిస్తుంది. అయితే, అతిగా ఆలోచించడం మానుకోవాలి. ప్రతిదీ పర్ఫెక్ట్‌గా ఉండాలని ప్రయత్నించి మీ శక్తిని వృథా చేసుకోకండి.
వృశ్చిక రాశి:
ఈ రోజు మీ మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు. అయితే, అనవసరమైన విషయాలపై దృష్టి సారించకుండా ముఖ్యమైన పనులపై ఫోకస్ చేయండి. ఆర్థిక స్థితి మరియు ఉద్యోగ పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ధనుస్సు రాశి:
నేడు ధనుస్సు రాశి వాయు అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో సొంత అవసరాలను విస్మరిస్తారు. ఇది మనసులో అసమతుల్యతను కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం నేర్చుకోండి. ప్రతి విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి.
మకర రాశి:
మనసులో ఉన్న విషయాలను బయటకు చెప్పకుండా దాచుకోవడం వల్ల భారం పెరుగుతుంది. ఏదైనా సమస్య ఇబ్బంది పెడుతుంటే దానిని చర్చించి పరిష్కరించుకోండి. పని పరంగా అంతా సజావుగానే సాగుతుంది కానీ, ఆలోచనలను నియంత్రించుకోవడం ఈ రోజు మీకు చాలా ముఖ్యం.
కుంభ రాశి:
మీ మనసులో ఎన్నో అద్భుతమైన ప్రణాళికలు మెదులుతాయి. కానీ కేవలం ఆలోచిస్తే సరిపోదు, వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యం. ఏదైనా ఒక పనిని ఎంచుకుని దానిని పూర్తి చేస్తేనే మీకు నిజమైన సంతృప్తి లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు బాగుంటుంది.
మీన రాశి:
ఈ రోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఇతరులు అన్న మాటలను ఎక్కువగా పట్టించుకుని బాధపడే అవకాశం ఉంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండి, మీ పనిపై మాత్రమే శ్రద్ధ పెట్టండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే ఈ రోజు విజయవంతంగా ముగుస్తుంది.