హిందూ సంప్రదాయంలో గురువారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, జీవితంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆగస్టు 20వ తేదీన గ్రహాల గమనం ఆధారంగా అన్ని రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. కొద్దిమందికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటే, మరికొందరు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి: ఈ రోజు మీకు ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా సాగిపోతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చిన్న తరహా కోర్సుల్లో పాల్గొనడానికి ఇది సరైన సమయం. ఇతరులతో స్నేహపూర్వకంగా మాట్లాడటం ద్వారా మంచి ఆలోచనలు తట్టడంతో పాటు మీ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి.
వృషభ రాశి: కార్యాలయంలో మీ నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ప్రేమ జీవితంలో మధురమైన క్షణాలు ఆనందాన్ని ఇస్తాయి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం అత్యంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథున రాశి: రొమాంటిక్ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. పనిలో నిజాయితీగా ఉంటే మెరుగైన ఫలితాలు మీ సొంతమవుతాయి. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
కర్కాటక రాశి: ఇతరులకు సాయం చేయడం, మంచి పనులు చేయడంలో ఈ రోజు గడిచిపోతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. ఇళ్లలోని కొన్ని పనులను చక్కదిద్దుకోవడానికి సమయం కేటాయించండి. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వల్ల కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.
సింహ రాశి: ప్రేమ వ్యవహారాల్లో తలెత్తే చిన్నపాటి సమస్యలను నేర్పుగా పరిష్కరించుకోండి. వృత్తిరిత్యా కొన్ని సవాళ్లు ఎదురైనా, మీ ప్రతిభతో వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. ధన, ఆరోగ్య స్థితులు సానుకూలంగా ఉన్నాయి.
కన్య రాశి: కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది కానీ మనీ మేనేజ్మెంట్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.
{{/usCountry}}కన్య రాశి: కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. ప్రేమ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది కానీ మనీ మేనేజ్మెంట్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి.
{{/usCountry}}తులా రాశి: మీరు వేసే ప్రణాళికలు భవిష్యత్తులో మంచి ఫలితాలను, ప్రశాంతతను ఇస్తాయి. ప్రేమ సంబంధాల్లోని పొరపొచ్చాలను తొలగించుకోండి. ఆఫీస్‌లో కొత్త బాధ్యతలను స్వీకరించండి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.
వృశ్చిక రాశి: ఆఫీస్ బాధ్యతలను పూర్తి చేయడంలో మీ వంతు కృషి చేయండి. ఆర్థిక ఇబ్బందులు కొన్ని కీలక నిర్ణయాలకు అడ్డుతగిలే అవకాశం ఉంది. కాబట్టి డబ్బును ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
ధనుస్సు రాశి: వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు నిబద్ధతతో కూడిన అప్రోచ్ అవసరం. కెరీర్‌లో ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది.
మకర రాశి: లవ్ లైఫ్‌లో వచ్చే సమస్యలను తెలివితేటలతో డీల్ చేయండి. ఆఫీస్‌లో మీ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ, ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొంత మానసిక అశాంతిని కలిగిస్తాయి.
కుంభ రాశి: ప్రేమ జీవితాన్ని మరింత సృజనాత్మకంగా మార్చుకోండి. ఆఫీస్ ఒత్తిళ్లను చిరునవ్వుతో తిప్పికొట్టండి. ఈ రోజు మీకు ఆర్థిక సమృద్ధి చేకూరుతుంది. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అప్పజెప్పిన పనులను సకాలంలో పూర్తి చేయండి.
మీన రాశి: ఆర్థిక పరమైన ఇబ్బందులు కొద్దిగా ఇవాళ మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దు. వృత్తిపరంగా మీ ఉత్పాదకత బాగుంటుంది. సంపద పరంగా పర్వాలేదనిపించినా, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.