Today Horoscope: ఈరోజు పన్నెండు రాశుల రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి హనుమంతుడి కృప.. లాభాల పంట!

Today Horoscope: మే 26 మంగళవారం నాడు బజరంగబలి ఆశీస్సులతో ఏ రాశి వారికి అదృష్టం పడుతుంది? ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయి? మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల పూర్తి ఫలితాలు మీకోసం.

Published on: May 26, 2026, 04:00:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం మన దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మే 26వ తేదీ మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామి ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడిని భక్తితో కొలిస్తే భయం, రోగాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మరి ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎవరికి లాభాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.

Today Horoscope: ఈరోజు పన్నెండు రాశుల రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి హనుమంతుడి కృప.. లాభాల పంట!
Today Horoscope: ఈరోజు పన్నెండు రాశుల రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి హనుమంతుడి కృప.. లాభాల పంట!

మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభిస్తుంది. మీరు ఒక ప్రాజెక్ట్ కోసం పగలు రాత్రి కష్టపడిన తీరుకు ఇప్పుడు తగిన ప్రతిఫలం అందుతుంది. కోర్టు కేసులు లేదా భూ వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిర్మాణ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు వస్తాయి. డబ్బు ఆదా చేయడంలో సఫలమవుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

వృషభ రాశి:

రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. బద్ధకాన్ని వదిలి పనిలోకి దిగితే అద్భుతాలు చేయవచ్చు. టీం తో కలిసి చేసే పనుల్లో పెద్ద విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి.

మిథున రాశి:

దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం మీరు వేసే ప్రణాళికలు ఫలిస్తాయి. అయితే, స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ తీసుకోవడం ఇప్పుడు మంచిది కాదు. వెన్ను నొప్పి లేదా కీళ్ల నొప్పులు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు రాతపూర్వక ఒప్పందాలు తప్పనిసరి. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు తమ ప్లాన్లను ఎవరికీ తెలియనివ్వకూడదు. మీ లక్ష్యాలు నెరవేరే వరకు వాటిని రహస్యంగా ఉంచడం శ్రేయస్కరం. ఆఫీసులో మీ వెనుక గోతులు తీసే వారు ఉంటారు, కాబట్టి మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. అప్రమత్తంగా ఉంటేనే వివాదాల నుంచి తప్పించుకోగలరు.

సింహ రాశి:

అవసరం లేని వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తే మీ బడ్జెట్ తలకిందులవుతుంది. స్నేహితులతో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వాహనం నడిపేటప్పుడు వేగం పట్ల జాగ్రత్త వహించండి.

కన్య రాశి:

మీకు ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. దీనివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి డిన్నర్ డేట్ లేదా లాంగ్ డ్రైవ్ వెళ్లే ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కెరీర్ లో కొత్త మలుపులు వచ్చే అవకాశం ఉంది.

తులా రాశి:

తుల రాశి వారు ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు లోనుకాకూడదు. ముఖ్యంగా కెరీర్, డబ్బు విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. వ్యాపారస్తులు ఆచితూచి అడుగు వేయాలి. ఆఫీసులో పని నెమ్మదించడం వల్ల అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు.

వృశ్చిక రాశి:

ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ, సుఖ సంతోషాల కోసం చేసే ఖర్చులు పెరగవచ్చు. ప్రేమ జీవితంలో పాత విషయాల వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. బయట తిండి వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం.

ధనుస్సు రాశి:

నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అయితే పిల్లల చదువులు, ఇంటి అవసరాల కోసం ఆకస్మిక ఖర్చులు రావచ్చు. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. మైగ్రేన్ లేదా తలనొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు, సరిగ్గా నిద్రపోవడం అవసరం. మీ కష్టానికి తగిన తీపి ఫలితం దక్కే రోజు ఇది.

మకర రాశి:

కళాకారులు, రచయితలు, సంగీత రంగంలో ఉన్న వారికి పెద్ద ప్లాట్‌ఫారమ్ లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి అమ్మకాలు పెరిగి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జీవితం చాలా సంతృప్తికరంగా గడుస్తుంది.

కుంభ రాశి:

ఈ రోజు ఉదయం కాస్త ఒత్తిడితో మొదలవుతుంది. పెండింగ్ పనులు పెరిగిపోవడం వల్ల ఆందోళన చెందుతారు. కానీ సాయంత్రానికి పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా టెండర్ల కోసం ప్రయత్నిస్తున్న వారికి పెద్ద ఒప్పందం కుదురుతుంది. తోటి ఉద్యోగుల రాజకీయాలకు దూరంగా ఉండండి.

మీన రాశి:

ఈ రోజు మీ జీవితంలో ఏదైనా సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృద్ధికి కావలసిన అవకాశాలు తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకోవడంలో మీ చాతుర్యం మీకు రక్షణగా నిలుస్తుంది. బంధాలు మరింత బలపడతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More