Today Horoscope: ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఇందులో ఉందేమో చూసుకోండి!
Today Horoscope: ఏప్రిల్ 28, 2026 నాటి ద్వాదశ రాశిఫలాలు ఇక్కడ చూడండి. గ్రహ గతుల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. మరికొన్ని రాశుల వారు పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఈ మార్పులు మన దైనందిన జీవితంపై, చేసే పనులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఏప్రిల్ 28, 2026 నాటి గ్రహ స్థితిగతులను విశ్లేషిస్తే, కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతమైన విజయాలను అందించబోతోంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి.

ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి:
ఈరోజు మీకు కొంత మందకొడిగా ప్రారంభం కావచ్చు. ఏ పని మొదలుపెట్టినా ఇతరుల సహాయం ఆశించకుండా మీరే స్వయంగా రంగంలోకి దిగడం మంచిది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత పురోగతి కనిపిస్తున్నా, చేతికి అందిన సొమ్ము నిలకడగా ఉండటం కష్టమే. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది, వాటిని పెద్దవి చేయకండి. ఎండ తీవ్రత లేదా అలసట వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
వృషభ రాశి:
మీ ఆలోచనలు వేగంగా సాగుతాయి కానీ పనులు మాత్రం నత్తనడకన సాగే అవకాశం ఉంది. ఒకేసారి పది పనులు నెత్తిన వేసుకోవడం వల్ల గందరగోళం నెలకొంటుంది. ఆఫీసులో మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్యం తప్పదు.
మిథున రాశి:
వృత్తిపరంగా మీకు ఇది గొప్ప రోజు. కొత్త పరిచయాలు లేదా సమాచారం మీ కెరీర్‌కు ప్లస్ అవుతాయి. గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు మిత్రుల సహకారంతో పూర్తవుతాయి. భాగస్వామ్య బంధాల్లో స్పష్టత అవసరం, లేదంటే అనవసరమైన అపోహలు వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
నేడు కర్కాటక రాశి వారికి బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తుంది. అటు ఆఫీసులో, ఇటు ఇంట్లో మీ అవసరం అందరికీ ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించడం మంచిది. సంపాదన బాగున్నా, దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి. మనసు కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ, రోజు ప్రశాంతంగానే ముగుస్తుంది.
సింహ రాశి:
మీరు పనుల్లో ముందుంటారు. ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది. పాత బాకీలు వసూలు కావచ్చు లేదా ఆగిపోయిన పనులు పూర్తి కావచ్చు. ప్రయాణాలకు సంబంధించిన ప్లాన్ సిద్ధం చేసుకుంటారు. అయితే, ఏదైనా విషయంలో అతిగా ప్రవర్తించకండి, లేదంటే మంచి సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది.
కన్య రాశి:
నేడు కన్య రాశి వారు చిన్న విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. ఏదైనా పనిలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. భాగస్వామితో అనవసరమైన అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది.
తుల రాశి:
జీవితంలో సమతుల్యత పాటించాల్సిన రోజు ఇది. పనికి, కుటుంబానికి సమాన ప్రాధాన్యత ఇవ్వండి. ఆఫీసులో కొత్త బాధ్యతలు దక్కవచ్చు. మనసులో ఏదో ఒక మూల చిన్న అసంతృప్తి ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. స్పష్టమైన చర్చలు సంబంధాలను మెరుగుపరుస్తాయి.
వృశ్చిక రాశి:
మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఇన్నాళ్లుగా అటకెక్కిన ఫైళ్లు కదులుతాయి. ధన ప్రాప్తికి గట్టి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో బంధం మరింత బలపడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మరిన్ని విజయాలు మీ సొంతం.
ధనుస్సు రాశి:
ఈరోజు మీకు ఓర్పు చాలా అవసరం. పనుల్లో జాప్యం జరిగినా, చివరకు ఫలితం మాత్రం అనుకూలంగానే వస్తుంది. మిత్రులతో గడిపే సమయం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. శారీరకంగా కొంత బలహీనంగా అనిపించవచ్చు, సరైన విశ్రాంతి తీసుకోండి.
మకర రాశి:
నేడు మకర రాశికి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీసులో మీ ఇమేజ్ పెరుగుతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. భాగస్వామితో నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
కుంభ రాశి:
కొత్త ఆలోచనలు మెదడులో మెదులుతాయి కానీ వాటిని అమలు చేయడం కొంత సవాలుగా మారుతుంది. సృజనాత్మక ఆలోచనలతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. డబ్బు విషయంలో పొదుపు మంత్రం పాటించండి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం.
మీన రాశి:
మీ మనసు నిలకడగా ఉండదు. పదే పదే నిర్ణయాలు మార్చుకోవడం వల్ల పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. ఏకాగ్రతతో పని చేస్తేనే ఫలితం ఉంటుంది. ఆర్థిక జాగ్రత్తలు అవసరం. కుటుంబం అండగా నిలుస్తుంది. భాగస్వామితో మెతక వైఖరి అవలంబించడం వల్ల గొడవలు రాకుండా ఉంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


