హిందూ సనాతన ధర్మంలో గురువారానికి అత్యంత విశిష్టత ఉంది. జగత్పాలలకుడైన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించే ఈ పవిత్ర దినాన, గ్రహ నక్షత్రాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

జ్యోతిష్య గణాంకాల ప్రకారం నవంబర్ 5, గురువారం రోజున కొందరికి అదృష్టం తలుపు తట్టనుండగా, మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజూవారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 12 రాశుల వారి జాతక విశేషాలను పరిశీలిద్దాం.
ఈరోజు రాశి ఫలాలు
మేష రాశి:
మేష రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనేక మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలున్నాయి. మీ దైనందిన ఆహారంలో ఆకుకూరలను, పోషకాహారాన్ని భాగం చేసుకోండి. కాస్త ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. తీరిక లేని సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడం మంచిది.
వృషభ రాశి:
వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వామ్య వ్యవహారాల్లో తీవ్ర అప్రమత్తత పాటించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. అతిగా ఆలోచించి మానసిక ఒత్తిడిని కొనితెచ్చుకోకండి. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు.
మిథున రాశి:
పనిభారం మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవడం మరువకండి. మిథున రాశి వారికి ఈ రోజు గడువుతో కూడిన పనుల వల్ల కాస్త బిజీగా గడుస్తుంది. ఏదైనా సామాజిక లేదా కుటుంబ వేడుకల కారణంగా మీకు అదనపు బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి జాతకులు ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మానసిక ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మీకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. కార్యాలయంలో మీపై ఉన్న ప్రతికూల వాతావరణం క్రమంగా తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్థలను తొలగించుకునేందుకు ఇది సరైన సమయం. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు.
కన్యా రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. కార్యాలయంలో మీపై ఉన్న ప్రతికూల వాతావరణం క్రమంగా తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్థలను తొలగించుకునేందుకు ఇది సరైన సమయం. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు.
కన్యా రాశి:
{{/usCountry}}వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడే సరికొత్త అవకాశాలు కన్యా రాశి వారికి తారసపడతాయి. సానుకూల దృక్పథం కెరీర్, ఆర్థిక పరిస్థితి మరియు ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది.
తులా రాశి:
ప్రేమ వ్యవహారాల్లో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కార్యాలయంలో సాగే రాజకీయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ జీవితంలో సమతుల్యతను పాటించండి.
వృశ్చిక రాశి:
ఈ రోజు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలసివస్తుంది. అయితే ఎలాంటి విషయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ నిర్దిష్ట లక్ష్యాలపైనే పూర్తి దృష్టి పెట్టండి. ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది. తగినన్ని నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.
ధనుస్సు రాశి:
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు ఇది. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో ప్రొడక్టివ్‌గా ఉంటుంది. మీ అంకితభావం మంచి గుర్తింపు తెస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సానుకూల ఆలోచనలను అలవర్చుకోండి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు సానుకూల శక్తి నిండుగా ఉంటుంది. మీ వృత్తిపరమైన పనులపై పూర్తి ఏకాగ్రత ఉంచండి. అయితే ఆర్థిక పరమైన లావాదేవిల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి:
ఈ రోజు మీకు ఎంతో సంతోషాన్నిచ్చే శుభవార్తలు అందే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా గడిచిపోతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపడేందుకు ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోండి. పని ఒత్తిడిని మీపైకి ఎక్కువగా రానివ్వకండి. వ్యాపారస్తులకు తొందర్లోనే మంచి వార్తలు వినే అవకాశం ఉంది.