నవంబర్ 5 రాశి ఫలాలు: గురువారం విష్ణుమూర్తి అనుగ్రహంతో ఈ 5 రాశులకు అదృష్టం.. ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!

నవంబర్ 5, గురువారం గ్రహ నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా 12 రాశుల వారికి భిన్నమైన ఫలితాలు ఉండనున్నాయి. కొందరికి ఆర్థికంగా, వృత్తిపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడితే, మరికొందరు ఆరోగ్యం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. 

Published on: Nov 5, 2026, 04:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో గురువారానికి అత్యంత విశిష్టత ఉంది. జగత్పాలలకుడైన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించే ఈ పవిత్ర దినాన, గ్రహ నక్షత్రాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది.

నవంబర్ 5 రాశి ఫలాలు: గురువారం విష్ణుమూర్తి అనుగ్రహంతో ఈ 5 రాశులకు అదృష్టం.. ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!
నవంబర్ 5 రాశి ఫలాలు: గురువారం విష్ణుమూర్తి అనుగ్రహంతో ఈ 5 రాశులకు అదృష్టం.. ధనలాభం, ఉద్యోగంలో పురోగతి!

జ్యోతిష్య గణాంకాల ప్రకారం నవంబర్ 5, గురువారం రోజున కొందరికి అదృష్టం తలుపు తట్టనుండగా, మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రోజూవారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి 12 రాశుల వారి జాతక విశేషాలను పరిశీలిద్దాం.

ఈరోజు రాశి ఫలాలు

మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనేక మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలున్నాయి. మీ దైనందిన ఆహారంలో ఆకుకూరలను, పోషకాహారాన్ని భాగం చేసుకోండి. కాస్త ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. తీరిక లేని సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపడం మంచిది.

వృషభ రాశి:

వ్యాపార రంగంలో ఉన్నవారు భాగస్వామ్య వ్యవహారాల్లో తీవ్ర అప్రమత్తత పాటించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. అతిగా ఆలోచించి మానసిక ఒత్తిడిని కొనితెచ్చుకోకండి. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు.

మిథున రాశి:

పనిభారం మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవడం మరువకండి. మిథున రాశి వారికి ఈ రోజు గడువుతో కూడిన పనుల వల్ల కాస్త బిజీగా గడుస్తుంది. ఏదైనా సామాజిక లేదా కుటుంబ వేడుకల కారణంగా మీకు అదనపు బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి జాతకులు ఈ రోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మానసిక ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మీకు ఇష్టమైన పనులు చేస్తూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా, ఉత్సాహంగా సాగిపోతుంది. కార్యాలయంలో మీపై ఉన్న ప్రతికూల వాతావరణం క్రమంగా తొలగిపోతుంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్థలను తొలగించుకునేందుకు ఇది సరైన సమయం. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు.

కన్యా రాశి:

వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడే సరికొత్త అవకాశాలు కన్యా రాశి వారికి తారసపడతాయి. సానుకూల దృక్పథం కెరీర్, ఆర్థిక పరిస్థితి మరియు ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది.

తులా రాశి:

ప్రేమ వ్యవహారాల్లో మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కార్యాలయంలో సాగే రాజకీయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటూ జీవితంలో సమతుల్యతను పాటించండి.

వృశ్చిక రాశి:

ఈ రోజు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలసివస్తుంది. అయితే ఎలాంటి విషయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ నిర్దిష్ట లక్ష్యాలపైనే పూర్తి దృష్టి పెట్టండి. ప్రేమ జీవితం సాఫీగా సాగుతుంది. తగినన్ని నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.

ధనుస్సు రాశి:

మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు ఇది. ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో ప్రొడక్టివ్‌గా ఉంటుంది. మీ అంకితభావం మంచి గుర్తింపు తెస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సానుకూల ఆలోచనలను అలవర్చుకోండి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు సానుకూల శక్తి నిండుగా ఉంటుంది. మీ వృత్తిపరమైన పనులపై పూర్తి ఏకాగ్రత ఉంచండి. అయితే ఆర్థిక పరమైన లావాదేవిల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి:

ఈ రోజు మీకు ఎంతో సంతోషాన్నిచ్చే శుభవార్తలు అందే అవకాశం ఉంది. పాత స్నేహితులను కలుసుకుని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి.

మీన రాశి:

మీన రాశి వారికి ఈ రోజు సాధారణంగా గడిచిపోతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపడేందుకు ఆకుకూరలను మీ ఆహారంలో చేర్చుకోండి. పని ఒత్తిడిని మీపైకి ఎక్కువగా రానివ్వకండి. వ్యాపారస్తులకు తొందర్లోనే మంచి వార్తలు వినే అవకాశం ఉంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More