ఈరోజు చాలా విశిష్టమైన రోజు. గురువారం, ధనుర్మాసం, మార్గశిర మాసంలో వచ్చే నాలుగవ గురువారం కావడం విశేషం. అయితే ఈ విశేషమైన రోజున లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. ధన ప్రాప్తి కలుగుతుంది. సుఖసంతోషాలను కూడా పొందడానికి వీలవుతుంది. మరి ఈ విశేషమైన రోజున ఏం చేయాలి? ఏం చేస్తే చక్కటి ఫలితం కనబడుతుందో ఇప్పుడు చూద్దాం.
మార్గశిర మాసంలో వచ్చే నాల్గవ గురువారం + ధనుర్మాసం

ఈరోజు అనగా డిసెంబర్ 18న మార్గశిర మాసంలో వచ్చే నాలుగవ గురువారం. పైగా ధనుర్మాసం కూడా మొదలైంది. ఈ గురువారానికి చాలా విశిష్టత ఉంది. భక్తి, శ్రద్ధలతో ఈరోజు లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి కూడా వీలవుతుంది. మరి ఈ రోజు ఎలా పూజించాలి? లక్ష్మీనారాయణులను ఏ విధంగా ఆరాధిస్తే చక్కటి ఫలితం కలుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు ఎలా లక్ష్మీ నారాయణులను ఆరాధించాలి?
- ఈరోజు మార్గశిర గురువారం కాబట్టి తలస్నానం మాత్రమే చేయాలి. షాంపూతో తల రుద్దుకోకూడదు. అలాగే తలకు నూనె కూడా రాసుకోకూడదు.
- గడపలకు పసుపు రాసి, గుమ్మం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. నీళ్లలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే మరీ మంచిది.
- ఈ గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
- పూజగదిలో అష్టదళ పద్మం వేసి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పెట్టి పూజించాలి.
- తులసి దళాలను, పుష్పాలను కూడా సమర్పించండి. లక్ష్మీదేవికి ఇష్టమైన గులాబీ పూలను కూడా సమర్పించండి.
- పసుపు గణపతిని పెట్టి ముందుగా గణపతి పూజ చేసి, ఆ తర్వాత లక్ష్మీనారాయణులను ఆరాధించండి.
- ఈరోజు పిండి దీపాలను వెలిగిస్తే కోటిరెట్ల పుణ్యఫలితం కలుగుతుంది. ఒక్కో పిండి దీపంలో ఐదు ఒత్తులు వేసి, ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.
- లక్ష్మీదేవిని పూజించేటప్పుడు “ఓం శ్రీ మహాలక్ష్మీ నమః” లేదా “ఓం నమో నారాయణాయ నమః” మంత్రాలను చదువుకోండి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
లక్ష్మీ వ్రత కథను చదివితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. తులసి కోట వద్ద ఆ దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేసి, మంత్రాలను పఠిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
ముఖద్వారం అందంగా
{{/usCountry}}లక్ష్మీ వ్రత కథను చదివితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. తులసి కోట వద్ద ఆ దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేసి, మంత్రాలను పఠిస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
ముఖద్వారం అందంగా
{{/usCountry}}ఈరోజు గుమ్మం ముందు లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి. ఇంటి ముఖద్వారం పై పసుపు లేదా గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇది శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈరోజు ఇంటి ముందు దీపాలు పెడితే కూడా ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అపర కుబేర యోగం కలుగుతుంది.
నరదిష్ఠి
ఈరోజు ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి, గుమ్మానికి కట్టినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. నరదిష్ఠి తొలగిపోతుంది.
గురు బలం
జాతకంలో గురు బలం లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఈరోజు పసుపు, గంధం పొడిని కలిపి దానితో బొట్టు పెట్టుకోండి. ఇలా చేస్తే గురు బలం పెరుగుతుంది. ఈరోజు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది. జాతకంలో దురదృష్టం ఉంటే తొలగిపోతుంది. అరటి చెట్టుకు పసుపు తాడు కడితే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోయండి. ఇలా ఈ విధంగా ఈరోజు ఆచరించినట్లయితే ప్రత్యేక ఫలితాన్ని పొందవచ్చు. సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండడానికి కూడా వీలవుతుంది.