...
...
Next Story

ఈరోజు సోమవారం+మహా శివాక్షయ యోగం.. ఈ 3 పనులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం!

మహా శివాక్షయ యోగం అత్యంత పవిత్రమైన, అరుదైన యోగంగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటారు. ఈ రోజున పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో శివాభిషేకం చేయడం, "ఓం నమః శివాయ" లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించడం, శివనామస్మరణలో సమయాన్ని గడపడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు.

Published on: Jul 13, 2026, 08:00:13 IST
Advertisement

చాలామంది సోమవారం నాడు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే ఈ రోజు కేవలం సోమవారమే కాదు, మహా శివాక్షయ యోగం కూడా. అసలు ఈ మహా శివాక్షయ యోగం అంటే ఏమిటి? ఆ రోజు పూజ చేస్తే ఎందుకు ఫలిస్తుంది? తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి? ఇలాంటి వివరాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు పొరపాటున కూడా ఈ తప్పులు చేయద్దు

ఈరోజు సోమవారం+మహా శివాక్షయ యోగం.. ఈ 3 పనులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం! (pinterest)
ఈరోజు సోమవారం+మహా శివాక్షయ యోగం.. ఈ 3 పనులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం! (pinterest)

ఈరోజు చాలా పవిత్రమైన రోజు. కచ్చితంగా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. పూర్తిగా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే కోపం, అసూయ, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకుని దైవనామస్మరణతో సమయాన్ని గడపడం వల్ల అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఎవరినీ దూషించకుండా వీలైనంత వరకు మౌనంగా ఉండడం మంచిది. లేకపోతే దైవచింతనలో గడపండి.

ఈరోజు తప్పకుండా చేయాల్సిన మూడు పనులు ఇవి

1.శివాభిషేకం చేయండి

కుదిరితే శివాలయంలో గానీ, ఇంట్లో గానీ పాలు, బిల్వపత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఇది ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.

2.మంత్రం జపించండి

కనీసం 108 సార్లు "ఓం నమః శివాయ" లేదా మహామృత్యుంజయ మంత్రం జపించండి. అద్భుతమైన ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

3.శివ నామస్మరణ

అలాగే ఈరోజు శివనామస్మరణతో సమయాన్ని గడిపితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతోషంగా ఉండొచ్చు. పరమేశ్వరుని అనుగ్రహం కూడా కలుగుతుంది.

ఈరోజు చేసే పూజకు ఎందుకు అంత శక్తి ఉంటుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే, శతాబ్ద కాలంలో చాలా అరుదుగా వచ్చే శక్తివంతమైన తిథి-నక్షత్రాల కలయికే ఈ మహా శివాక్షయ యోగం అని చెప్పొచ్చు. ఈరోజు విశ్వంలో శివతత్వానికి సంబంధించిన సానుకూల శక్తి అత్యధికంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈరోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

ఓం నమః శివాయ!

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks