...
...
Next Story

రేపు మాఘమాసం + రథసప్తమి + ఆదివారం +సూర్య జయంతి + 2+5=7.. ఇలా చేస్తే ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలుగుతుంది!

చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అలాగే అందరికంటే ముందు ఉండొచ్చు. ఏ కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే, రథసప్తమి వేళ ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి?

Published on: Jan 24, 2026, 13:30:45 IST
Advertisement

రథసప్తమి చాలా విశేషమైన రోజు. రథసప్తమి పండుగ నాడు సూర్యభగవానుని భక్తితో ఆరాధిస్తే ఎంతో మంచి జరుగుతుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉన్నట్లయితే సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. అలాగే అందరికంటే ముందు ఉండొచ్చు. ఏ కష్టాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అయితే, రథసప్తమి వేళ ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలి? రథసప్తమి నాడు సూర్యుడి అనుగ్రహాన్ని పొందడానికి ఎలాంటి వాటిని పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మాఘమాసం + రథసప్తమి + ఆదివారం +సూర్య జయంతి + 2+5=7

రేపు మాఘమాసం + రథసప్తమి + ఆదివారం +సూర్య జయంతి + 2+5=7 (pinterest)
రేపు మాఘమాసం + రథసప్తమి + ఆదివారం +సూర్య జయంతి + 2+5=7 (pinterest)

మాఘ మాసంలో సూర్యుని ఆరాధించడం చాలా విశేషమైనది. అందులోను ఆదివారం రావడం మరింత విశేషం. రథసప్తమి నాడు ఆకాశంలో నక్షత్ర మండలం రథ ఆకారంలో కనబడుతుందని అంటారు. 25 (2+5=7) ఏడు సంఖ్య కూడా మంచిది. రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేసి, సూర్యుణ్ని ఆరాధించడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. సూర్యుని అనుగ్రహంతో సమస్త రోగాలు తొలగిపోవడమే కాకుండా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి.

జిల్లేడు ఆకులు, రేగిపండ్లు

రథ సప్తమి నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు, రేగిపండ్లను కచ్చితంగా శిరస్సు, భుజాలపై పెట్టుకుని చేయండి. పిల్లలకు స్నానం చేయించేటప్పుడు కూడా వీటిని పెట్టి చేయించండి.

రథసప్తమి నాడు వీటిని పాటిస్తే మంచిది

ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య మంత్రాలను పఠించండి.

ఈ విధంగా పాటిస్తే ఆరోగ్యం కలుగుతుంది. దీర్ఘాయుష్షు, సంపదలను కూడా పొందడానికి వీలవుతుంది.

రథసప్తమి నాడు ఈ పరిహారాలను పాటించడం మంచిది

రథసప్తమి నాడు జాతకంలో సూర్య స్థానం బలపడాలంటే ఆ రోజున ఉప్పు తినకూడదని అంటారు. అలాగే ఉప్పును దానం చేయడం కూడా చాలా మంచిది.

అలాగే బెల్లం, ఆవు నెయ్యితో పరమాన్నం చేసి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది.

ఆ రోజు దానధర్మాలు చేస్తే కూడా విశేషమైన ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది.

ఉపవాసం ఉండి కేవలం పండ్లు తింటే, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి.

రథసప్తమి నాడు ఆదిత్య హృదయ స్తోత్రం, గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

రథసప్తమి నాడు రాగి పాత్రలో నీటిని నింపి, ఎర్రటి పుష్పాలను అందులో వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే అదృష్టం పెరుగుతుంది. శత్రువులపై కూడా విజయాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే రథసప్తమి నాడు మట్టికుండలో పాలను పెట్టి, వాటిని వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాల్లో కొంతసేపు ఉంచాలి. దాంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి, సూర్యుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

ఇక్కడ ఆదిత్య హృదయం స్తోత్రం చదవండి

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe