...
...
Next Story

రేపు మూల నక్షత్రం రోజున సరస్వతీ పూజ.. పుస్తకాలు, పెన్నులు ఎందుకు పూజించాలి?ఇంట్లో ఇలా పూజిస్తే శుభ ఫలితాలు!

నవరాత్రుల్లో సరస్వతీ పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. విద్య, జ్ఞానం, సంగీతం, కళలు, సాహిత్యానికి అధిదేవతగా భావించే సరస్వతీ దేవిని నవరాత్రుల చివరి మూడు రోజుల్లో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా మూల నక్షత్రం రోజున అమ్మవారిని పూజించడం సంప్రదాయంగా భావిస్తారు.

Published on: Oct 15, 2026, 11:00:39 IST
Advertisement

నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లోనూ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో రోజుకొక రూపంలో అమ్మవారిని ఆరాధించి, ప్రత్యేకమైన నైవేద్యాలను నివేదిస్తూ ఉంటారు. అలాగే ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలో చూసుకుని, దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు.

నవరాత్రుల్లో చాలా ముఖ్యమైనది సరస్వతీ పూజ

రేపు మూల నక్షత్రం రోజున సరస్వతీ పూజ.. పుస్తకాలు, పెన్నులు ఎందుకు పూజించాలి?ఇంట్లో ఇలా పూజిస్తే శుభ ఫలితాలు! (AI)
రేపు మూల నక్షత్రం రోజున సరస్వతీ పూజ.. పుస్తకాలు, పెన్నులు ఎందుకు పూజించాలి?ఇంట్లో ఇలా పూజిస్తే శుభ ఫలితాలు! (AI)

నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనకు మాత్రమే కాదు, విద్య, కళలు, జ్ఞానం, సంగీతానికి అధిదేవత అయినటువంటి సరస్వతీ దేవిని పూజించడానికి కూడా అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. నవరాత్రుల చివరి మూడు రోజుల్లో సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. ముఖ్యంగా మూల నక్షత్రం ఉన్న రోజు సరస్వతీ దేవి అనుగ్రహం కలగడానికి పూజిస్తారు.

సరస్వతీ పూజ 2026

ఈ ఏడాది సరస్వతీ పూజ అక్టోబర్ 16, అనగా శుక్రవారం నాడు వచ్చింది. రేపు సరస్వతీ దేవిని ఆరాధించేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

నవరాత్రుల సమయంలో సరస్వతీ దేవి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలు, విద్యకు సంబంధించిన వస్తువులను కూడా అమ్మవారి ముందు పెట్టి పూజ చేయడం జరుగుతుంది.

సరస్వతీ దేవి అనుగ్రహంతో పిల్లలు చదువులో ఏకాగ్రత పెట్టడానికి వీలవుతుంది. విద్యార్థులు చదువులో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా ఈ పూజ చేయడం మంచిది.

సరస్వతీ పూజ ఎప్పుడు, ఎలా చేస్తే మంచిది?

రేపే సరస్వతీ పూజ. సరస్వతీ దేవిని నవరాత్రుల్లో ఆరాధించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. రేపు మూల నక్షత్రం వేళ సరస్వతీ దేవిని ఆరాధించడం వలన విద్యార్థులు చదువులో బాగా రాణించడానికి వీలవుతుంది.

ముందు స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి, సరస్వతీ దేవి చిత్రం లేదా విగ్రహాన్ని పెట్టి, అమ్మవారికి పసుపు, కుంకుమలు, గంధం సమర్పించాలి.

అలాగే తెల్లటి లేదా పసుపు పూలను సరస్వతీ దేవికి సమర్పించడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.

దాంతో పాటు దీప, ధూప, నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించండి. అక్షింతలు, పండ్లు, కొబ్బరికాయను కూడా సమర్పించండి.

పాలు, పాయసం, ఇతర వస్తువులను నైవేద్యంగా సమర్పించండి.

సరస్వతీ దేవి ముందు పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, సంగీత వాయిద్యాలు వంటివి ఉంచి పూజ చేయాలి.

సరస్వతీ మంత్రాలు, సరస్వతీ స్తోత్రాన్ని కూడా భక్తితో పఠించండి.

పుస్తకాలను ఎందుకు పూజించాలి?

పుస్తకాలు జ్ఞానానికి ప్రతీక. అమ్మవారి ముందు వాటిని పెట్టడం వలన విద్య పట్ల గౌరవాన్ని, జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని భక్తుల నమ్మకం.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks