మరి కొన్ని రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. విశ్వావసు నామ సంవత్సరానికి స్వస్తి పలుకబోతున్నాము. అయితే పరాభవనామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఈ నెల 19న జరుపుకోబోతున్నాము. ఉగాది నాడు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడిని తినడం, కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టడం ఇలా వివిధ పద్ధతులను పాటిస్తూ ఉంటాము.

పరాభవనామ సంవత్సరంలో ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం కలగబోతోంది. పరాభవ పేరుకి మాత్రమే కానీ ఈ రాశుల వారికి మాత్రం బాగా కలిసి రాబోతోంది. విపరీతమైన లాభాలు కలుగుతాయి, విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? పరాభవ నామ సంవత్సరంలో అదృష్టం కలిగే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పరాభవ నామ సంవత్సరం ఈ రాశులకు వరం.. విపరీతమైన అదృష్టం, ధనప్రాప్తితో పాటు అనేక లాభాలు
1.తులా రాశి:
తులా రాశికి శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన బాగా కలిసి రాబోతోంది. అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు కూడా తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జూన్ 2 వరకు ఈ రాశి వారికి ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
2.వృషభ రాశి:
ఈ రాశి వారికి ఉగాది నుంచి బాగా కలిసి రాబోతోంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. శని 11వ స్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి వారికి బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. ఆస్తులను కొనుగోలు చేస్తారు. పరాభవనామ సంవత్సరం నుంచి ఈ రాశి వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి. బాగా కలిసి వస్తుంది.
3.కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఉగాది నుంచి బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శత్రు బాధలు, అప్పుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. గురు బలం జూన్ 2 నుంచి అక్టోబర్ 30 దాకా ఉండడంతో ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 24 తర్వాత ఈ రాశి వారికి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ కొత్త సంవత్సరం ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది.
4.మకర రాశి:
{{/usCountry}}కన్యా రాశి వారికి ఉగాది నుంచి బాగుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శత్రు బాధలు, అప్పుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. గురు బలం జూన్ 2 నుంచి అక్టోబర్ 30 దాకా ఉండడంతో ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది. జనవరి 24 తర్వాత ఈ రాశి వారికి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ కొత్త సంవత్సరం ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతోంది.
4.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరంలో విజయాలు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జూన్ నుంచి అక్టోబర్ దాకా ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వివాహం జరుగుతుంది. జనవరిలో ఆకస్మిక ధనప్రాప్తిని పొందవచ్చు. మొత్తం మీద పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి కూడా బాగుంటుంది.
5.కుంభ రాశి:
ఈ రాశి వారికి ఏలినాటి శని దోష ప్రభావం తొలగిపోతుంది. గురు బలం వీరిని బాగా కాపాడుతుంది. పరాభవనామ సంవత్సరంలో ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. వివాహ, దాంపత్య సమస్యల నుంచి కూడా బయటపడతారు. వ్యాపారులకు కూడా ఇది శుభ సమయం. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు చేసే వారికి అద్భుతంగా కలిసి వస్తుంది.