...
...
Next Story

Ugadi Kumbha rasi Horoscope: పరాభవనామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది? నెలల వారీగా తెలుసుకోండి!

Ugadi Kumbha rasi Horoscope: పరాభవనామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది? విశ్వావసునామ సంవత్సరం పూర్తయిపోయి, పరాభవ సంవత్సరం వచ్చింది. ఈ ఏడాది కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఎలాంటి మార్పులు వస్తాయి? పూర్తి వివరాలతో చూసేద్దాం. నెలల వారీగా తెలుసుకోండి.

Published on: Mar 19, 2026, 08:47:07 IST
Advertisement

విశ్వావసునామ సంవత్సరం పూర్తయిపోయి, పరాభవ సంవత్సరం వచ్చింది. ఈ ఏడాది కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి ఎలాంటి మార్పులు వస్తాయి? పూర్తి వివరాలతో చూసేద్దాం.

పరాభవనామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది?

Ugadi Kumbha rasi Horoscope: పరాభవనామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది? (pinterest)
Ugadi Kumbha rasi Horoscope: పరాభవనామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎలా ఉంటుంది? (pinterest)

గురువు జూన్ నుంచి ఆరవ స్థానంలో, శని రెండవ స్థానంలో, రాహువు డిసెంబర్ దాకా ఒకటవ స్థానంలో, కేతువు డిసెంబర్ దాకా ఏడవ స్థానంలో సంచరించడం వలన ఈ రాశి వారు మధ్యస్థ నుంచి చెడు ఫలితాలను చూస్తారు. ఏలినాటి శని అంత్య భాగంలో ఉంది. కుంభ రాశి వారికి ఈ ఏడాది చికాకులు, రాజకీయ ఒత్తులు, మనస్పర్థలు వంటివి ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో ఇబ్బందులు వస్తాయి.

ఉద్యోగంలో చేరిన వారు మొదటి ఆరు నెలలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మార్పు వస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ రుణ బాధలు మిమ్మల్ని బాధ పెడతాయి. అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైతే అప్పులు తీసుకోకుండా చూసుకోవాలి.

వీళ్ళకు బాగా కలిసి వస్తుంది

రైతులు, సినీ రంగం, మీడియా రంగాల వారికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. జన్మ రాహు ప్రభావం వలన రాజకీయ ఒత్తులు ఇబ్బంది పెడతాయి. రాజకీయ నాయకులకు ఇది చెడు కాలమని చెప్పొచ్చు. స్త్రీలకు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. డిసెంబర్ నుంచి మార్చి వరకు బాగుంటుంది. ఈ రాశి వారు ఖర్చులను అదుపులో పెట్టుకుంటే మంచిది. అలాగే మాటలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారాలు:

ఈ నెలల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ పరంగా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికపరంగా లాభాలను చూస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత ఏర్పడుతుంది. స్త్రీలకు ఈ నెల బాగుంటుంది.

మే 2026:

ఈ నెల మీకు అంతగా అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు శ్రమ పెరుగుతుంది. ఏ పని కూడా సకాలంలో పూర్తవదు. స్త్రీలకు కూడా ఈ నెల సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో కలహాలు ఉండొచ్చు.

జూన్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. శత్రువుల కారణంగా ఇబ్బందులు పెరుగుతాయి. నమ్మినవారు కూడా మోసం చేస్తారు. జ్ఞాతులతో విరోధం కలుగుతుంది. స్త్రీలకు కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి.

జూలై 2026:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. సకాలంలో డబ్బు అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు కూడా చికాకులు పెరుగుతాయి. అధిక ఒత్తిడి ఉంటుంది. స్త్రీలకు ఆందోళన కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు.

ఆగస్టు 2026:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలను చూస్తారు. కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు. మిత్రుల సహాయంతో పనులను పూర్తి చేస్తారు. తండ్రికి అనారోగ్య సమస్యలు కలగవచ్చు. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది.

సెప్టెంబర్ 2026:

ఈ నెల మీకు పెద్దగా అనుకూలంగా లేదు. కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. దాంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు తోటి వారితో సఖ్యత లేకపోవడంతో పని ఒత్తిడి పెరుగుతుంది.

అక్టోబర్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. దూర ప్రాంతాలకు బదిలీలు కలగవచ్చు. స్త్రీలకు కుటుంబ విభేదాలు, భర్తతో కలహాలు వంటివి ఉండొచ్చు. అనారోగ్య సమస్యలు కూడా బాధ పెట్టొచ్చు.

నవంబర్ 2026:

ఈ నెల మీకు వృత్తి, ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. ఆర్థిక లాభం ఉంటుంది. స్త్రీలకు మనసులో ఉల్లాసం ఉంటుంది. అనుకున్న పనులు టైమ్‌కు పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

డిసెంబర్ 2026:

ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కావాల్సిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కూడా రావచ్చు.

జనవరి 2027:

ఈ నెల మీకు అనుకూలంగా ఉండదు. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. బంధువుల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు ఇంట్లో కలహాలు కలగవచ్చు. ఉద్యోగంలో కూడా సమస్యలు ఉండొచ్చు.

ఫిబ్రవరి 2027:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటాయి. అప్పులు చేస్తారు. స్త్రీలకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి వారితో వాదనలు జరగవచ్చు. కీళ్లవాతం, నడుము నొప్పి వంటివి బాధ పెట్టొచ్చు.

మార్చి, ఏప్రిల్ 2027:

ఈ నెల మీకు అనుకూలంగా లేదు. కొన్ని పనులు నిలిచిపోతాయి. తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు రావచ్చు. ఎక్కువ నిద్ర వలన సమస్యలు కలుగుతాయి. దూర దేశ ప్రయాణాలు చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks