కార్తీక మాసం అంటే మొట్టమొదట మనకి గుర్తు వచ్చేది దీపారాధన. అందులోనూ ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం తింటే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే కార్తీక మాసంలో పిండి దీపాలు, కొబ్బరికాయలతో ఐశ్వర్య దీపం- ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు.

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చని భావిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఉన్న ప్రత్యేకత ఇంతా అంతా కాదు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అయితే కార్తీకమాసంలో అసలు ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగించాలి? దాని వెనుక కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు?
కార్తీక మాసంలో శైవక్షేత్రాలు భక్తులతో, దీపాలతో కళకళ్ళాడతాయి. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఆలయంలో కూడా ఉసిరి దీపాలను చూడొచ్చు. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు? అసలు ఉసిరి దీపానికి కార్తీకమాసానికి సంబంధం ఏంటి?
శివ పురాణం ప్రకారం చూసినట్లయితే, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివస్వరూపం అని భావిస్తారు. ఉసిరి చెట్టు కింద దీపం పెడితే సకల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపాన్ని పెడతారు. మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా ఉసిరి దీపాన్ని పెట్టడం వలన తొలగిపోతాయట.
దేవుళ్లు, దేవతలు కొలువై ఉంటారు
ఉసిరి చెట్టుపై దేవుళ్లు, దేవతలు కొలువై ఉంటారని.. అందుకనే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం, ఉసిరి దీపాన్ని వెలిగించడం వంటివి పాటిస్తారు. పైగా ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం. ఎవరైతే ఈ కార్తీకమాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
తులసి మొక్క ఎదుట దీపారాధన:
{{/usCountry}}ఉసిరి చెట్టుపై దేవుళ్లు, దేవతలు కొలువై ఉంటారని.. అందుకనే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం, ఉసిరి దీపాన్ని వెలిగించడం వంటివి పాటిస్తారు. పైగా ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపం. ఎవరైతే ఈ కార్తీకమాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని, ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
తులసి మొక్క ఎదుట దీపారాధన:
{{/usCountry}}తులసి మొక్క ఎదుట దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అందుకే చాలా మంది కార్తీక మాసంలో తులసి మొక్క ముందు దీపారాధన చేస్తారు. ప్రతిరోజు తులసి మొక్క ఎదుట దీపాన్ని పెడితే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతారు.
ఉసిరి దీపం ఎలా పెట్టాలి?
కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని పెట్టేటప్పుడు గుండ్రంగా ఉండే ఉసిరికాయను తీసుకుని, కాయ మధ్యలో గుండ్రంగా కట్ చేసి, అందులో నూనె లేదా నెయ్యి వేసి, అందులో వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే సకల దేవతల అనుగ్రహం ఉంటుందని పురాణాలు కూడా తెలుపుతున్నాయి. నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి.