ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. అయితే వరలక్ష్మీ వ్రతం చేసేవారు కచ్చితంగా కొన్ని వస్తువులను ముందే సిద్ధం చేసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి పూజా సామాగ్రి లిస్ట్ చూసేసి ఇప్పుడే రెడీ పెట్టేసుకోండి.
వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి:

వరలక్ష్మీ వ్రతాన్ని నియమనిష్టలతో జరుపుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ వరలక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వాళ్లు కచ్చితంగా విధానాన్ని తెలుసుకుని పాటించాలని, అలాగే వరలక్ష్మీ వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.
వరలక్ష్మీ వ్రతానికి పసుపు, కుంకుమ, హారతి కర్పూరం, అగరబత్తులు, వక్కలు, తమలపాకులు, బియ్యం, బెల్లం, డబ్బా, అరటి పండ్లు కావాలి. అలాగే నైవేద్యానికి మిశ్రమ ఫలాలు తీసుకోండి. మూడు రకాల పండ్లు ఉండేటట్టు చూసుకోండి. పూలమాలలు, విడి పువ్వులు, కొబ్బరికాయలు, చిల్లర పైసలు, కలశం కోసం చెంబు, పంచామృతాలు, తోరాలు, మామిడి కొమ్మలు, జాకెట్ ముక్కలు, ఆభరణ ద్రవ్యాలు, ఆచమన పాత్ర, అక్షంతలు, వరిపిండి, అమ్మవారికి పేట, హారతి పళ్లెం, గంట, వాయినాలు, నైవేద్యం, అమ్మవారి ప్రతిమ.
దీపారాధనకి కావలసిన సామాగ్రి: ఆవు నెయ్యి, అగ్గిపెట్టె, ఒత్తులు, చేతులు తుడుచుకోవడానికి వస్త్రం.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకుని, పూజా మందిరాన్నీ కూడా శుభ్రం చేసుకుని మండపాన్ని ఏర్పాటు చేయాలి.
మండపం పైన బియ్యపు పిండితో ముగ్గులు వేసి, కలశం పెట్టుకోవాలి.
{{/usCountry}}మండపం పైన బియ్యపు పిండితో ముగ్గులు వేసి, కలశం పెట్టుకోవాలి.
{{/usCountry}}ఆ తర్వాత అమ్మవారి ఫోటో లేదా రూపును పెట్టుకుని పూజ చేయాలి.
తోరాలు, అక్షింతలు, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.
గణపతి పూజ చేసి, ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకోవాలి.
చివరిగా వ్రతకథ చదువుకోవాలి. అమ్మవారికి చేసిన నైవేద్యాలను సమర్పించాలి.
ఇలా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సకల సౌభాగ్యాలు అందుతాయి. లక్ష్మీదేవి కృపతో ఐశ్వర్యం లభిస్తుంది. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండడానికి వ్రతాన్ని తప్పక ఆచరించడం మంచిది.
తోరం కట్టుకునేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రం
బధ్నామి దక్షిణే హస్తే
నవసూత్రం శుభప్రదమ్
పుత్రపౌత్రాభివృద్ధిం చ
దీర్ఘాయుష్యమవాప్నుయాత్..
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.