శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. వరలక్ష్మీ వ్రతాన్ని ఉదయం పూట, అందులో బ్రహ్మ ముహూర్తంలో వేళ్లేదా, శుభ ముహూర్తంలో చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. రేపు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే, సరైన సమయానికి చేసుకోవడం చాలా ముఖ్యమైనది. వరలక్ష్మీ వ్రతం ఏ సమయంలో ఆచరిస్తే మంచిది? పూజకు అనుకూలమైన ఉత్తమ సమయాలు ఏవో వివరంగా తెలుసుకుందాం.

దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో చేసుకోకూడదు. దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో నూతన కార్యాచరణ లేదా కలశ ప్రతిష్ఠ వంటి ముఖ్యమైన ఘట్టాలను ప్రారంభించకూడదు.
పూజకు అనుకూలమైన ఉత్తమ సమయాలు ఇవే
బ్రహ్మ ముహూర్తం: ఉదయం వేళ వరలక్ష్మీ వ్రతం ఆచరించాలనుకునే వారు బ్రహ్మ ముహూర్తం లేదా ఉదయం పూట వ్రతం చేసుకోవడానికి సరైన సమయం. పూజకు అత్యంత ప్రశస్తమైన సమయం ఉదయం నాలుగు నుంచి ఎనిమిది వరకు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణంలో సానుకూల శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.
ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే, దుర్ముహూర్తం ముగిశాక ఉదయం 9:06 నుంచి 10:30 మధ్య సమయంలో చేసుకోవచ్చు. ఈ సమయం కూడా పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైనదని చెప్పొచ్చు.
పూజ నిర్వహణలో ముఖ్యమైన విషయం సంకల్పం, కలశ స్థాపన:
పూజ మొత్తాన్ని ఒకే సమయంలో పూర్తి చేయాల్సిన అవసరమే లేదు. ఉదయం 9:04 నుంచి 8:00 మధ్యలో లేదా 9:06 నుంచి 10:30 మధ్యలో సంకల్పం చెప్పుకోవచ్చు. కలశ స్థాపన, అమ్మవారి ప్రతిష్ఠాపన చేసిన చాలు. తర్వాత నియమ నిష్ఠలతో అష్టోత్తరం చదవడం, నైవేద్యం సమర్పణ వంటివి చేయొచ్చు.
వ్రతం అయిపోయాక తాంబూలం కచ్చితంగా ఇవ్వాలి.. ఈ తప్పులు చేయొద్దు
వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాక తాంబూలం ఇవ్వాలి. కానీ ఎడమ చేతితో తాంబూలాన్ని ఇవ్వకూడదు. కుడి చేతితో పట్టుకొని ఇవ్వడం మంచిది.
{{/usCountry}}వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాక తాంబూలం ఇవ్వాలి. కానీ ఎడమ చేతితో తాంబూలాన్ని ఇవ్వకూడదు. కుడి చేతితో పట్టుకొని ఇవ్వడం మంచిది.
{{/usCountry}}తాంబూలం ఇచ్చేటప్పుడు కొన్ని వస్తువులను తప్పక పెట్టండి. పసుపు, కుంకుమ, తమలపాకులు, రూపాయి కాసు, పువ్వులు, గాజులు, పండ్లు. కొందరు తెలియక కొబ్బరికాయ కూడా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వకూడదు.
అరటిపండు తమలపాకుపై పెట్టి కొన మీ వైపుకు ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే ఇచ్చిన తాంబూలానికి తగిన ఫలితం దక్కుతుంది.
చిరిగిపోయిన ఆకులు, పాడైపోయిన వాటిని తాంబూలంలో ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.