...
...
Next Story

వసంత పంచమి నాడు ఈ రాశుల వారి అదృష్టం డబుల్ అవుతుంది.. ఉద్యోగాలు, పరీక్షల్లో మంచి ఫలితాలతో పాటు అనేక లాభాలు!

ఈ ఏడాది వసంత పంచమి చాలా విశేషమైనది. వసంత పంచమి వేళ మకర రాశిలో గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇప్పటికే మకర రాశిలో ఉన్నారు. దీంతో అదృష్టం పెరుగుతుంది. ఈ యోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. సరస్వతి దేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

Published on: Jan 21, 2026, 13:30:51 IST
Advertisement

ఈ ఏడాది వసంత పంచమి నాడు చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. కెరీర్‌లో, వ్యాపారంలో కూడా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. అలాగే సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి కూడా వీలవుతుంది. ఈ సంవత్సరం వసంత పంచమి జనవరి 23న వచ్చింది. వసంత పంచమి రోజున గ్రహాల కలయిక ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.

వసంత పంచమికి ఈ రాశుల వారికి అనేక లాభాలు, అదృష్టం కూడా కలుగుతుంది (pinterest)
వసంత పంచమికి ఈ రాశుల వారికి అనేక లాభాలు, అదృష్టం కూడా కలుగుతుంది (pinterest)

ఈ ఏడాది వసంత పంచమి చాలా విశేషమైనది. వసంత పంచమి వేళ మకర రాశిలో గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఇప్పటికే మకర రాశిలో ఉన్నారు. దీంతో అదృష్టం పెరుగుతుంది. ఈ యోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. అలాగే సరస్వతి దేవి ప్రత్యేక అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరన్నది ఇప్పుడు చూద్దాం.

వసంత పంచమికి ఈ రాశుల వారికి అనేక లాభాలు, అదృష్టం కూడా కలుగుతుంది

1.మిథున రాశి

మిథున రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. వసంత పంచమి వేళ ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. పరీక్షలు రాస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఇది అద్భుతమైన సమయం.

ఏ రంగంలో అయినా సరే అద్భుతంగా రాణిస్తారు, విజయాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో తీరని సమస్యలు ఈ సమయంలో తీరిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తారు. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.

2.సింహ రాశి

మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. కొత్త ప్రాజెక్ట్‌ను చేపడతారు. కొత్త ఉద్యోగం కూడా లభిస్తుంది. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. కెరీర్‌లో, వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks