చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వలన అనేక లాభాలు కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని విగ్రహాలను పెడితే కూడా అదృష్టం కలిసి వస్తుంది. సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా మన జీవితంలో ప్రభావం చూపిస్తుంది. అయితే వస్తువులను పెట్టేటప్పుడు సరైన దిశలో వాటిని పెడితే మంచిది. అలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి, ఆనందం, ప్రశాంతత, డబ్బు కలుగుతాయి.

చాలామంది ఇళ్లల్లో రకరకాల డెకరేటివ్ వస్తువులను పెడుతూ ఉంటారు. ఇల్లు అందంగా కనిపించాలని వాటిని ఉంచుతారు. అయితే ఇల్లు అందంగా కనపడటమే కాదు, వాస్తు ప్రకారం కూడా కలిసి రావాలన్నా, అదృష్టం పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా వీటన్నీ ఇంట్లో పెట్టడం మంచిది.
వాస్తు ప్రకారం ఈ విగ్రహాలను ఇంట్లో పెడితే అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల మార్పుల్ని చూస్తారు
1.తాబేలు విగ్రహం
ఇంట్లో చిన్న తాబేలు విగ్రహాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. వాస్తు ప్రకారం తాబేలు విగ్రహం ఇంట్లో ఉంటే విష్ణువు ఉన్నట్టే, అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఉంటాయి. తూర్పు లేదా ఉత్తరం వైపు తాబేలు విగ్రహం పెట్టడం మంచిది. ఇలా చేయడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
2.ఏనుగు విగ్రహం
ఏనుగు శక్తి, ధనం వంటి వాటిని సూచిస్తుంది. వాస్తు ప్రకారం ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంటే బాగా కలిసి వస్తుంది. వెండి లేదా కాంస్య ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఆనందం, ప్రశాంతత ఉంటాయి. రాహువు చెడు ఫలితాల నుంచి కూడా బయటపడటానికి అవుతుంది.
3.ఒంటె విగ్రహం
ఇంట్లో ఒంటె విగ్రహాన్ని పెట్టితే కూడా మంచి జరుగుతుంది. వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ విగ్రహం సహనం, శక్తి, విజయాలను అందిస్తుంది. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను చూడవచ్చు. నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది.
4.గోవు విగ్రహం
{{/usCountry}}ఇంట్లో ఒంటె విగ్రహాన్ని పెట్టితే కూడా మంచి జరుగుతుంది. వాస్తు, ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ విగ్రహం సహనం, శక్తి, విజయాలను అందిస్తుంది. ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే కెరీర్లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో కూడా చక్కటి ఫలితాలను చూడవచ్చు. నిద్రపోతున్న అదృష్టం కూడా మేల్కొంటుంది.
4.గోవు విగ్రహం
{{/usCountry}}చాలామంది ఇళ్లల్లో ఆవు, దూడ విగ్రహాలను పెడుతూ ఉంటారు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టడం వలన ప్రశాంతత, ప్రేమ, అదృష్టం కలిసి వస్తాయి. ఆవు, దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి వ్యాపించి అదృష్టం కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు చదువుకునే గదిలో ఈ విగ్రహాన్ని పెడితే మరింత మంచిది.
5.హంస విగ్రహాలు
హంస విగ్రహాలను ఇంట్లో పెడితే వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. వీటిని బెడ్‌రూమ్‌లో పెడితే ప్రేమ పెరుగుతుంది, ఆనందంగా ఉండొచ్చు. భార్య, భర్తల మధ్య బలమైన సంబంధం ఏర్పడి ఆనందంగా ఉండొచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.