చాలామంది వాస్తు ప్రకారం జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. ఇంట్లో రకరకాల మొక్కలను కూడా పెంచుతూ ఉంటాము. వాటిని కూడా వాస్తు ప్రకారమే నాటడం మంచిదని చెబుతారు.
గులాబీ మొక్కలు

మన ఇంట్లో మొక్కలు ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయి. అలాగే సానుకూల శక్తికి కూడా కారణమవుతాయి. ఎక్కువ మంది ఇళ్లలో పూల మొక్కలు ఉంటాయి. ముఖ్యంగా గులాబీ పూల మొక్కలను చాలా మంది పెంచుతారు. రంగురంగుల గులాబీ పూల మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే గులాబీ పూలను పూజలో కూడా ఉపయోగించవచ్చు.
అయితే గులాబీ పూల మొక్కలను ఇంట్లో పెంచేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. అలాగే చాలా మందిలో ఉండే సందేహం ఏమిటంటే, గులాబీ మొక్క ఇంట్లో ఉండొచ్చా? ఉండకూడదా? దీని వల్ల శుభ ఫలితాలు కలుగుతాయా? అశుభ ఫలితాలు కలుగుతాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గులాబీ పూలతో పూజ చేయొచ్చా?
మొదట ఈ విషయానికి వస్తే, గులాబీ పూలతో పూజ చేయవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజల్లో ఈ పూలను ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తగ్గుతుందని చెబుతారు. శ్రేయస్సు, ఐశ్వర్యం, అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
సానుకూల శక్తి రెట్టింపు
వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఇంట్లో గులాబీ మొక్కలను పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఈ మొక్కలను పెంచవచ్చు. ఇవి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.
గులాబీ మొక్క ఏ దిశలో ఉంటే మంచిది?
{{/usCountry}}వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఇంట్లో గులాబీ మొక్కలను పెంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఈ మొక్కలను పెంచవచ్చు. ఇవి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.
గులాబీ మొక్క ఏ దిశలో ఉంటే మంచిది?
{{/usCountry}}వాస్తు ప్రకారం ఈ మొక్కను సరైన దిశలో నాటాలి. అప్పుడే సానుకూల ఫలితాలను పొందవచ్చని చెబుతారు. ఇంటి ముందు లేదా ఆవరణలో తూర్పు వైపు గులాబీ మొక్కలను నాటడం శుభప్రదంగా భావిస్తారు. ఇవి సానుకూల శక్తిని పెంచి, శుభ ఫలితాలను తీసుకొస్తాయని నమ్మకం.
ఉత్తర దిశలో నాటచ్చా?
ఒకవేళ తూర్పు వైపు నాటడం సాధ్యం కాకపోతే, ఉత్తర దిశలో కూడా గులాబీ మొక్కలను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల సంపద, అభివృద్ధికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు. ఈ దిశలో ఉంచినా శుభ ఫలితాలను పొందవచ్చని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.
ఎప్పటికప్పుడు ఎండిపోయిన, వాడిపోయిన ఆకులను, పూలను తొలగిస్తూ ఉండాలి. అలాగే మొక్క చుట్టూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మురికి, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుందని చెబుతారు. అలాగే గులాబీ మొక్క ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా అవసరం.