మనిషి జీవితంలో బెడ్రూం లేదా పడకగదికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రోజంతా పనులతో అలసిపోయిన శరీరం, మనస్సు ప్రశాంతతను కోరుకునేది అక్కడే. వాస్తు శాస్త్రం ప్రకారం.. పడకగది కేవలం నిద్రకు మాత్రమే కాదు, దంపతుల మధ్య అన్యోన్యతకు, ఆ ఇంట్లోని సుఖశాంతులకు కూడా ప్రధాన కేంద్రం. అక్కడ ఉండే ప్రతి వస్తువు ఒక రకమైన శక్తిని విడుదల చేస్తుంది. మరి మీ బెడ్రూంలో ఉండకూడని వస్తువులు ఏవి? ఏ పొరపాట్లు చేస్తే వైవాహిక జీవితం దెబ్బతింటుంది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ ఎలక్ట్రానిక్ వస్తువులతో జాగ్రత్త

వాస్తు నిపుణుల సూచన ప్రకారం.. బెడ్రూంలో ఫ్రిజ్, ఇన్వర్టర్ లేదా గ్యాస్ సిలిండర్ వంటి వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు. ఈ వస్తువుల వల్ల గదిలోని సానుకూల శక్తి దెబ్బతింటుంది. దీని ప్రభావం నేరుగా మీ నిద్రపై పడుతుంది. ఫలితంగా నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ప్రశాంతమైన నిద్ర లేకపోతే మనిషి చికాకుకు గురవుతాడు, అది ఇంట్లో గొడవలకు దారితీస్తుంది.
ఈ దిశలో బెడ్రూం అస్సలు వద్దు
ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా అద్దెకు తీసుకునేటప్పుడు పడకగది దిశను తప్పక గమనించాలి. ఇంటికి ఈశాన్య మూల అంటే దైవంతో సమానం. ఈ దిశలో బెడ్రూం ఉండటం లేదా పడకగది తలుపు ఉండటం అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా ఉండటం వల్ల దంపతుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో మనస్పర్థలు వస్తుంటాయి. ఇద్దరి ఆలోచనలు కలవవు, అహంకార పూరిత గొడవలు పెరిగి సంసారం ప్రశాంతత కోల్పోతుంది.
పడకగదిలో ఇవి అస్సలు ఉంచకండి
పవిత్ర గ్రంథాలు: భగవద్గీత, ఖురాన్ లేదా బైబిల్ వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను బెడ్రూంలో పెట్టుకోకూడదు. వాటిని గౌరవంగా పూజా గదిలో ఉంచడమే శుభకరం.
చీపురు: చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అని భావిస్తాం, కానీ దానిని పడకగదిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. గదిలోని పాజిటివ్ ఎనర్జీని ఇది హరిస్తుంది.
{{/usCountry}}చీపురు: చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అని భావిస్తాం, కానీ దానిని పడకగదిలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. గదిలోని పాజిటివ్ ఎనర్జీని ఇది హరిస్తుంది.
{{/usCountry}}పదునైన వస్తువులు: కత్తులు, కత్తెరలు లేదా ఇతర పదునైన పనిముట్లు బెడ్రూంలో ఉంటే ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇవి ఇంట్లో ఉద్రిక్తతలకు, వివాదాలకు కేంద్రంగా మారుతాయి.
దేవుడి విగ్రహాలు: పడకగదిలో దేవతా మూర్తుల విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టుకోకూడదు. వీటికి ప్రత్యేకంగా పూజా మందిరం ఉండాలి.
చనిపోయిన వారి ఫోటోలు: కాలం చేసిన పెద్దల ఫోటోలను బెడ్రూంలో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అందుకే వాటిని హాలులో లేదా దక్షిణ దిశలో ఉంచాలి.
నీళ్ల బాటిల్ ఎక్కడ పెడుతున్నారు?
మనం సాధారణంగా రాత్రి పడుకునే ముందు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకుంటాం. కానీ, ఈ నీళ్ల బాటిల్‌ను పొరపాటున కూడా ఆగ్నేయ మూలలో (South-East) ఉంచకూడదు. ఆగ్నేయం అగ్ని తత్వానికి సంబంధించింది, నీరు దానికి విరుద్ధం. అక్కడ నీటిని ఉంచితే రాత్రంతా నిద్ర పట్టదు, తరచూ నిద్ర భంగం కలుగుతుంది.
మరికొన్ని ముఖ్యమైన చిట్కాలు
డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కిటికీకి ఎదురుగా ఉండకూడదు. అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉంటే మీ ప్రతిబింబం అందులో కనిపించకూడదు. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతాయి.
బెడ్రూంలో వాడే ఫర్నిచర్ వృత్తాకారంలో లేదా అర్ధ చంద్రాకారంలో ఉండకూడదు. చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న వస్తువులే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
లైటింగ్ నేరుగా ముఖంపై లేదా మంచంపై పడకుండా చూసుకోవాలి. కాంతి ఎప్పుడూ పక్కల నుంచి లేదా వెనుక నుంచి వచ్చేలా అమర్చుకోవాలి.
నిరాకరణ: పైన పేర్కొన్న అంశాలు వాస్తు నిపుణుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం ఉత్తమం.